Fire Dosa: దోసెకు మంటబెట్టి రెడీ చేశారు.. టేస్ట్ సంగతేంటో..

సౌతిండియా స్పెషల్ వంటల్లో ఒకటి దోసె. దీనిపై చాలా మంది అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి ఓ కొత్త రకమైన దోసె గురించి సోషల్ మీడియాలో వీడియో పోస్టు పెట్టాడు.

Fire Dosa: దోసెకు మంటబెట్టి రెడీ చేశారు.. టేస్ట్ సంగతేంటో..

Fire Dosa (1)

Fire Dosa: సౌతిండియా స్పెషల్ వంటల్లో ఒకటి దోసె. దీనిపై చాలా మంది అనేక ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి ఓ కొత్త రకమైన దోసె గురించి సోషల్ మీడియాలో వీడియో పోస్టు పెట్టాడు. ఫైర్ దోసె.. అనే ఈ ఐటెం పేరు వినడానికే క్రేజీగా అనిపిస్తుందా మరి తినడానికి ఇంకెలా ఉండొచ్చు. టేస్ట్ చేయలేకపోయినా దీనివైపు ఓ లుక్కేయండి.

మంట బెట్టి రెడీ చేసే ఈ దోసె కోసం కాస్త పిండి, నూనె, ఛీజ్, బటర్, చిల్లీ పౌడర్, శాస్, గరమ్ మసాలా, కూరగాయల ముక్కలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, ఉప్పు, కొత్తిమీర, చీజ్ శాస్ వాడేశాడు. ఆ తర్వాత అవన్నీ కలిపి దోసె దోరగా వేయించి చిన్న చిన్న ముక్కలుగా చేసి సర్వ్ చేశాడు.

ఓ ఫుడ్ బ్లాగర్.. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. వేలల్లో లైకులు రావడంతో పాటు చాలా మంది దోసె అభిమానులు తాము కూడా ట్రై చేస్తామని చెప్తున్నారు. ఇంతకీ ఇండోర్ లో ట్రై చేస్తున్న ఈ దోసె ఖరీదెంతో తెలుసా.. రూ.180