Deliver Free Food : కరోనా రోగులకు ఫ్రీగా భోజనం, ట్వీట్ వైరల్

వడోదర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ - 19 సోకిన రోగులకు హెల్తీ ఫుడ్ అందచేస్తానని..అది కూడా ఫ్రీగానే అంటూ..ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.

Deliver Free Food : కరోనా రోగులకు ఫ్రీగా భోజనం, ట్వీట్ వైరల్

Vadodara man

COVID-19 Patients :  ఇప్పుడు కరోనా టైం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ దూసుకెళుతోంది. ఎంతో మంది వైరస్ బారిన పడుతున్నారు. కొంతమంది కోలుకుంటుంటే..మరికొంతమంది చనిపోతున్నారు. కరోనా ఒక సవాల్ గా మారిపోయింది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు కనిపించాయో..ప్రస్తుతం అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే..కరోనా సోకిన వారికి మంచి పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ..కొంతమందికి ఇలాంటి ఆహారం తీసుకోవడం కుదరడం లేదు. దీంతో కొంతమంది స్వచ్చందంగా ముందుకొచ్చి వారికి ఫుడ్ అందిస్తున్నారు. ఇలాగే..వడోదర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ – 19 సోకిన రోగులకు హెల్తీ ఫుడ్ అందచేస్తానని..అది కూడా ఫ్రీగానే అంటూ..ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.

Shubhal Shah అనే వ్యక్తి ఫైనాన్స్ కన్సల్టంట్ గా ఉన్నారు. కార్పొరేట్ మేనేజ్ మెంట్ కు అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. కొవిడ్ పేషెంట్స్ కు వెంట ఉన్నానని, ఎవరైనా ఈ వైరస్ బారిన పడి బాధ పడుతుంటే..వారికి హెల్తీ, హైజెనిక్ లంచ్, డిన్నర్ అందిస్తామని 2021, ఏఫ్రిల్ 12వ తేదీన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అది కూడా ఇంటి వద్దకే ఫ్రీగా పంపిస్తానని వెల్లడించారు. తనకు ఎలాంటి పేరు, పబ్లిసిటీ అవసరం లేదని ట్వీట్ లో వెల్లడించారాయన. క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అతని నిర్ణయానికి నెటిజన్లు భేష్ అంటున్నారు.

ఇది వడోదర ప్రాంతం వారికేనా..ముంబై..ఇంకా ఇతర సిటీలో కూడా పంపిస్తారా అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి Shubhal Shah స్పందించారు. కేవలం వడోదర ప్రాంతం వరకు మాత్రమేనని స్పష్టం చేశారు. మరొక నెటిజన్ కేవలం హిందూ మతానికి చెందిన వారికేనా అని ప్రశ్నించారు. మతం, కులం, జాతీయత అనేది అవసరం కాదని, కొవిడ్ – 19 రోగులకు నిజంగా ఆహారం అవసరమని, కొద్దిగా మంచిగా ఆలోచించు..భాయ్ అంటూ Shubhal Shah రిప్లై ఇచ్చారు.

Read More : Uttar Pradesh : ఛాటింగ్ వద్దన్నందుకు ఇయర్ ఫోన్ కేబుల్ తో తమ్ముడిని చంపేసింది