Leopard Cub: చిరుత పిల్లలు అమ్ముతాం.. కావాలనుకునేవారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్ యాడ్

మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.. నేరుగా చిరుత పిల్లలనే అమ్మకానికి పెట్టేశాడు. తన వద్ద చిరుత పిల్ల ఉందంటూ.. సతారా జిల్లాకు చెందిన కరాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. రుషికేష్ ఇంగిల్ అలియాస్ లాల్యా అనే వ్యక్తిని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Leopard Cub: చిరుత పిల్లలు అమ్ముతాం.. కావాలనుకునేవారు సంప్రదించాలంటూ ఫేస్‌బుక్ యాడ్

Leopard Cub

Leopard Cub: మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.. నేరుగా చిరుత పిల్లలనే అమ్మకానికి పెట్టేశాడు. తన వద్ద చిరుత పిల్ల ఉందంటూ.. సతారా జిల్లాకు చెందిన కరాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. రుషికేష్ ఇంగిల్ అలియాస్ లాల్యా అనే వ్యక్తిని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వైల్డ్ లైఫ్ వార్డెన్ రోహిన్ భాటె, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ టీం అతనిపై ఫోకస్ పెట్టింది. చిరునామా కనిపెట్టి ఎట్టకేలకు శుక్రవారం అరెస్టు చేశారు. అతని దగ్గర ఎటువంటి చిరుత పులి పిల్ల లేకుండానే యాడ్ ఇచ్చాడంటూ ఆ తర్వాత గానీ తెలియలేదు. సరదా కోసం మాత్రమే అలా చేశానని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ విలాస్ కాలె ముందు వివరించాడు.