పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసొచ్చేలోపు చిన్న కొడుకు మరణం : ఎవ్వరికీ ఇటువంటి శోకం వద్దు భగవంతుడా?

కొడుకులతో అంత్యక్రియలు చేయించుకోవాల్సిన తండ్రి తన చేతులతో చెట్టంత ఎదిగిన కొడుకులకు తలకొరివి పెట్టాల్సి వస్తే..ఆ కన్నతండ్రి మానసిక వేదన గురించి చెప్పటానికి మాటలే ఉండవు. పెద్ద కొడుక్కి అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చిన తండ్రికి చిన్నకొడుకు కూడా చనిపోయాడని తెలిసి ఇంటిముందే కుప్పకూలిపోయాడా తండ్రి..

పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసొచ్చేలోపు చిన్న కొడుకు మరణం : ఎవ్వరికీ ఇటువంటి శోకం వద్దు భగవంతుడా?

Two Sons Died In Noida

Two sons died IN Noida : కొడుకులతో అంత్యక్రియలు చేయించుకోవాల్సిన తండ్రి తన చేతులతో చెట్టంత ఎదిగిన కొడుకులకు తలకొరివి పెట్టాల్సి వస్తే..ఆ కన్నతండ్రి మానసిక వేదన గురించి చెప్పటానికి మాటలే ఉండవు. అటువంటి కష్టాన్ని అనుభవిస్తున్న ఓ తండ్రి అత్యంత విషాదం గురించి విన్న ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ..‘‘ఇటువంటి ఘోరమైన కష్టం ఎవ్వరికీ రాకూడదు భగవంతుడా..’’అంటూ కంటికి కడివెడు కన్నీరుగా భోరున ఏడుస్తూ అంటున్న మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. యూపీలోని గ్రేటర్ నోయిడాలోని ఓ తండ్రి తీరని శోకం ఇది. జీవితాంతం వెన్నాడే విషాదం ఇది.

పెద్ద కొడుకుకు అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చాడో లేదో..ఇంతలోనే చిన్న కొడుకు చనిపోయాడని తెలిసి గుమ్మంలోనే కుప్పకూలిపోయాడో తండ్రి. ‘‘ఇటువంటి దారునాలు చూడటానికే నా దేవుడా నన్ను ఇంకా బ్రతికించి ఉంచావు’ అంటూ గుండెలవిసేలా ఏడ్చాడు. ఇక ఆ తల్లి పరిస్థితి చెప్పనే అక్కరలేదు. ఎంత ఘాతుకాన్ని చూడాల్సి వస్తోంది భగవంతుడా..అంటూ తలబాదుకుని ఏడేస్తోందా కన్నతల్లి. పెద్ద కొడుకుకు అంత్యక్రియలు చేసి ఇంటికితిరిగొచ్చే లోపే చిన్న కొడుకూ చనిపోయి కనిపించాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు కుమారులు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. ఎవ్వరూ వారిని ఓదార్చలేకపోతున్నారు. ఓదార్చటానికి మాటలే లేనట్లుగా అందరూ అలాగే విలపించిన ఘోరమైన ఘటనతో నోయిడాలో మంగళవారం (మే 11,2021) చోటుచేసుకుంది.

నోయిడాలోని వెస్ట్ జోన్ లోని జలాల్‌పూర్ గ్రామం నివసిస్తున్న అతర్ సింగ్ తీవ్రమైన జ్వరంతో చనిపోయిన తన పెద్ద కొడుకు పంకజ్ కు అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చాడు. ఇంతలోనే ఇంటికి తిరిగొచ్చాక చిన్న కొడుకు దీపక్ కూడా చనిపోయి ఉన్నాడు. ఇద్దరు పిల్లలను ఒకేసారి కోల్పోవడంతో అతర్ సింగ్, అతని భార్య కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

కాగా..అంతర్ సింగ్ కొడుకులు ఇద్దరికీ కరోనా టెస్టులు చేయించకపోవడంతో వారు కరోనా సోకి చనిపోయారా? లేక సాధారణ జ్వరంతోనే పెద్ద కొడుకు..చిన్నకొడుకు సాధారణంగానే చనిపోయాడా? అనే విషయంపై క్లారిటీ లేదు. టెస్టులు చేయించి ఉంటే కరోనానా కాదా? అనేది తెలిసేది అంటున్నారు స్థానికులు. దీని గురించి కొంతమంది గ్రామస్థులు మాట్లాడుతూ..అంతర్ సింగ్ కొడుకులే కాదు…కొన్ని రోజుల్లో ఇక్కడు ఆరుగురు మహిళలు సహా 18 మంది చనిపోయారని చెబుతున్నారు. ఏప్రిల్ 28న రుషీ సింగ్ అనే యువకుడు జ్వరంతో చనిపోయాడు..ఆ తరువాత అతడి కుమారుడు చనిపోయాడని తెలిపారు. చనిపోయినవారందరూ ముందు జ్వరంతో బాధపడ్డారని..ఆ తర్వాత ఊరిపి ఆడక చనిపోయారని తెలిపారు. అంటే కరోనాయే కారణం అనేలా ఉన్నాయి వీరి మరణాల పరంపర చూస్తే..