Kullad Pizza : సూర‌త్‌లో నోరూరిస్తున్న కుండ పిజ్జా

హోటళ్లు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. వంటకం పాతదైనా.. దానిని కొత్త పద్దతిలో వండి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

Kullad Pizza : సూర‌త్‌లో నోరూరిస్తున్న కుండ పిజ్జా

Kullad Pizza

Kullad Pizza : వంటకాలు పాతవైనా వాటిని వెరైటీగా వండి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంటారు కొందరు. పెద్ద పెద్ద పాత్రల్లో వండి వడ్డించే బిర్యానీని చిన్న చిన్న కుండల్లో వండి కుండ బిర్యానీ అని పేరుపెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఇక ఇదే తరహాలో ఇప్పుడు కుండ పిజ్జా వచ్చింది. కుల్హాద్ పిజ్జా పేరుతో గుజరాత్ రాష్ట్రం సూర‌త్‌లోని ఓ దుకాణం అందిస్తున్న ఈ డిష్ హాట్ రెసిపీగా మారింది. ఈ ఫిజ్జా కోసం క్యూ కడుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆంచి ముంబై అనే యూట్యూబ్ ఛానల్ సభ్యులు దుకాణం దగ్గరకు వెళ్లి కుల్హాద్ పిజ్జా రుచి, తయారీ విధంగా గురించి తెలుసుకున్నారు. ఆ వీడియోను మార్చి నెలలో యూట్యూబ్ లో పోస్ట్ చేయగా 23 లక్షల మంది చూశారు.

Read More : Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?

వీడియోలో తయారి విధానం కూడా చేయించారు. ఈ పిజ్జాను త‌యారు చేసేందుకు ముందుగా మిక్చ‌ర్‌ను త‌యారు చేశారు. బౌల్‌లో కార్న్‌, త‌రిగిన ట‌మోటా ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, ఉప్పు, చాట్‌మ‌సాలాను మిక్స్ చేశారు. ఆపై కుండ‌లో మిక్చ‌ర్‌ను నింపి దానిపై సాస్‌, వెన్న వేశాడు. దానిలో మొజ‌రెల్లా చీజ్‌, మ‌రికొంత మిక్చ‌ర్‌, లిక్విడ్ చీజ్‌ను యాడ్ చేసి పిజ్జా త‌యారు చేసేందుకు ఆ కుండ‌ను మైక్రోవేవ్‌లో ఉంచాడు. ఐదు నిమిషాల తర్వాత అది తినేందుకు సిద్ధమైంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.