Lion Attacks Man in Kolkata Alipore Zoo : కోల్‌కతా అలిపొరె జూలో వ్యక్తిపై సింహం దాడి.. తీవ్రగాయాలు

కోల్‌కతాలోని అలిపొరె జూలో ఓ గుర్తుతెలియని వ్యక్తిపై సింహం పంజా విసిరింది. ప్రహారిగోడ దూకి జూలోకి వెళ్లేందుకు యత్నించగా ఆ వ్యక్తిపై సింహం క్రూరంగా దాడి చేసింది. బాధితుడు తీవ్రంగా గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలించారు.

Lion Attacks Man in Kolkata Alipore Zoo : కోల్‌కతా అలిపొరె జూలో వ్యక్తిపై సింహం దాడి.. తీవ్రగాయాలు

Man seriously injured by lion at Alipore Zoo in Kolkata

Man seriously injured by lion at Alipore Zoo in Kolkata : కోల్‌కతాలోని అలిపొరె జూలో ఓ గుర్తుతెలియని వ్యక్తిపై సింహం పంజా విసిరింది. ప్రహారిగోడ దూకి జూలోకి వెళ్లేందుకు యత్నించిన సమయంలో ఆ వ్యక్తిపై సింహం క్రూరంగా దాడి చేసింది. సింహం దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడగా అతన్ని ఆస్పత్రికి తరలించారు.

ఇనుప కంచె దాటే యత్నంలో బోను బయటే ఉన్న సింహం అతడిపై తీవ్రంగా దాడిచేసింది. అప్రమత్తమైన జూలోని సెక్యూరిటీ గార్డులు సింహం బారినుంచి బాధిడిని రక్షించి వెంటనే ఎస్ఎస్కేమ్ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని, ఘటనకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చాక ఆ వ్యక్తి ఎవరినేది గుర్తిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.