Nupur Sharma: నుపుర్ శర్మకు సపోర్ట్ చేసి హత్యకు గురైన మరో వ్యక్తి

మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొహమ్మద్ ప్రవక్తపై విమర్శలు చేసినందుకు అంతర్జాతీయంగా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న సమయంలో ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Nupur Sharma: నుపుర్ శర్మకు సపోర్ట్ చేసి హత్యకు గురైన మరో వ్యక్తి

Nupur Sharma

 

 

Nupur Sharma: మహారాష్ట్రలోని అమరావతిలో 54ఏళ్ల కెమిస్ట్ ను కత్తితో పొడిచి చంపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో నుపుర్ శర్మకు సపోర్ట్ గా పోస్ట్ చేసినందుకే ఇలా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొహమ్మద్ ప్రవక్తపై విమర్శలు చేసినందుకు అంతర్జాతీయంగా వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న సమయంలో ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఉమేశ్ ప్రహ్లాద్రావ్ కోలె అనే వ్యక్తి జూన్ 21న హత్యకు గురయ్యారు. విచారణలో భాగంగా ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత భార్యతో పాటు షాప్ మూసేసి ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. అదే సమయంలో మరో వాహనంపై అతని కొడుకు సాకేత్(27), కోడలు వైష్ణవి వస్తున్నారు.

“కెమిస్ట్ హత్య విషయంలో ఐదుగురిని అరెస్ట్ చేశాం. ఎన్జీవో నిర్వహిస్తున్న ఇర్ఫాన్ ఖాన్ ను ప్రధాన నిందితుడిగా భావిస్తున్నాం. కోల్హె అమరావతి సిటీలో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నారు. కొన్ని వాట్సప్ గ్రూపుల్లో నుపుర్ శర్మకు సపోర్ట్ గా వచ్చిన పోస్టును షేర్ చేసినట్లు తెలుస్తుంది. అతను పొరబాటున షేర్ చేసినప్పటికీ ఆ గ్రూపులో అతని కస్టమర్లు, ముస్లిం సభ్యులు కూడా ఉన్నారు” అని అమరావతి కమిషనర్ డా. ఆర్తి సింగ్ శనివారం వెల్లడించారు.

Read Also: నుపుర్ శ‌ర్మ జాడ తెలియ‌ట్లేదు: మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం

ఇర్ఫాన్ ఖాన్.. ఐదుగురు వ్యక్తులను పురమాయించి ఒకొక్కరికి రూ.10వేలు ఇస్తానని సేఫ్ గా కారులో ఎస్కేప్ అయిపోవచ్చని తీసుకొచ్చాడని నమ్మించాడు. ముద్దిసర్ అహ్మద్ (22), షారూఖ్ పఠాన్ (25), అబ్దుల్ తౌఫిక్ (24), షోయబ్ ఖాన్ (22), అతిబ్ రషీద్ (22) అనే మిగిలిన నిందితులు నలుగురు రోజువారీ కూలీలుగా జీవనం సాగించేవారు. ఘటనాస్థలంలో సీసీటీవీ ఫుటేజి పరిశీలించి దర్యాప్తు జరిపారు. వారి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కొడుకు సాకేత్ కంప్లైంట్ మేరకు విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.