ఒళ్లుగగుర్పొడిచే వీడియో… 25సార్లు పొడిచి పొడిచి.. ఆ అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త

అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణం బలైంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ భర్త కిరాతకుడిలా మారాడు. కట్టుకున్న భార్యను పట్టపగలే అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి చంపాడు. ఒకటి కాదు రెండు కాదు 25 సార్లు పొడిచాడు.

ఒళ్లుగగుర్పొడిచే వీడియో… 25సార్లు పొడిచి పొడిచి.. ఆ అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త

Man Stabs Wife 25 Times

Man Stabs Wife 25 Times : అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణం బలైంది. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ భర్త కిరాతకుడిలా మారాడు. కట్టుకున్న భార్యను పట్టపగలే అందరూ చూస్తుండగానే వెంటాడి మరీ నడిరోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి చంపాడు. ఒకటి కాదు రెండు కాదు 25 సార్లు పొడిచాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఢిల్లీకి చెందిన హరీష్, నీలు దంపతులు. బుధ్‌ విహార్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. భర్త హరీష్ మ్యారేజీ బ్యూరోలో పని చేస్తున్నాడు. కాగా, కొన్ని రోజులుగా అతడు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించసాగాడు. ఈ క్రమంలో దీని గురించి భార్యాభర్తల మధ్య తరుచూ గొడవ జరిగేది. ఓ రోజు ఆగ్రహంతో ఊగిపోయిన హరీష్.. భార్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భర్త నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ఇంటి నుంచి రోడ్డు మీదకు పరిగెత్తింది. భయంతో రోడ్డు మీద పరుగులు తీసింది. అయినా హరీష్ ఊరుకోలేదు. ఆమెను వెంటాడి మరీ నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే రాక్షసంగా హత్య చేశాడు. కిండపడిపోయిన భార్యను కత్తితో పలుమార్లు పొడిచాడు.

ఇది గమనించిన చుట్టుపక్కల వారిలో కొందరు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అతడు కత్తితో వారిని బెదిరించడంతో వారు ముందుకు వచ్చే సాహసం చెయ్యలేకపోయారు. మరికొందరేమో చోద్యం చూస్తూ నిల్చున్నారు. ఇంకొందరు..తమకేమీ పట్టన్నట్టు తమ దారిన తాము పోయారు. హరీష్ 25సార్లు భార్యను పొడిచి పొడిచి మరీ చంపాడు. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమె స్పాట్ లోనే చనిపోయింది.

భార్య మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి వచ్చారు. డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఒంటిపై 25 కత్తిపోట్లు చూసి పోలీసులే నివ్వెరపోయారు. హరీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యాకాండ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో వైరల్ గా మారింది. ఒళ్లుగగుర్పొడిచే రీలిలో ఆ వ్యక్తి ప్రవర్తించాడు. ఈ హత్యాకాండను కళ్లారా చూసిన వారు భయంతో వణికిపోయారు. ఆ సైకోని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.