ఎంత ఘాటు ప్రేమో : భార్య నిద్ర కోసం.. విమానంలో 6 గంటలు నిలబడి!

తన భార్య అంటే అతడికి పిచ్చి. అదే పిచ్చి ప్రేమ.. అతడ్ని గంటల పాటు నిలబడి ఉండేలా చేసింది. ఎక్కడ తన భార్యకు నిద్రాభంగం అవుతుందోనని అలానే 6 గంటలు విమానంలో నిలబడ్డాడు.

  • Published By: sreehari ,Published On : September 10, 2019 / 07:39 AM IST
ఎంత ఘాటు ప్రేమో : భార్య నిద్ర కోసం.. విమానంలో 6 గంటలు నిలబడి!

తన భార్య అంటే అతడికి పిచ్చి. అదే పిచ్చి ప్రేమ.. అతడ్ని గంటల పాటు నిలబడి ఉండేలా చేసింది. ఎక్కడ తన భార్యకు నిద్రాభంగం అవుతుందోనని అలానే 6 గంటలు విమానంలో నిలబడ్డాడు.

తన భార్య అంటే అతడికి పిచ్చి. అదే పిచ్చి ప్రేమ.. అతడ్ని గంటల పాటు నిలబడి ఉండేలా చేసింది. ఎక్కడ తన భార్యకు నిద్రాభంగం అవుతుందోనని అలానే 6 గంటలు విమానంలో నిలబడ్డాడు. తాను కూర్చొనే సీటును కూడా భార్యకు ఇచ్చేసి హాయిగా నిద్రపోమ్మని చెప్పాడు. భర్త చేసిన త్యాగానికి ముచ్చటపడిన భార్య హాయిగా విమానంలో నిద్రపోయింది.

దీనికి సంబంధించిన ఫొటో ఒకటి ట్విట్టర్ లో తెగ వైరల్ అవుతోంది. కార్ట్నీ లీ జాన్సన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్టు చేశాడు. ‘ఈ పెద్ద మనిషి తన భార్య నిద్ర కోసం ఏక ధాటిగా 6 గంటలు అలాగే నిలబడ్డాడు. ఎంత ఘాటు ప్రేమో కదా?’ అని క్యాప్షన్ పెట్టాడు. వైరల్ అవుతున్న ఈ ఫొటోలో.. నిద్ర పోతున్న తన భార్య వైపు భర్త ప్రేమగా చూస్తున్నాడు. 

మొత్తం మూడు సీట్లలో భార్యే నిద్రపోయేసరికి నిద్ర ముంచుకువస్తున్న సరే.. సీటు లేక అతడు అలాగే నిలబడిపోయాడు. ఈ ఫొటో ట్విట్టర్ లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. వీరిని చూసిన నెటిజన్లు.. ఆదర్శ దంపతులంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. భార్యభర్తలిద్దరిపై నెటిజన్లు తమకు తోచినట్టుగా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

భార్య నిద్ర కోసం భర్త నిలబడిన విధానంపై కొందరు ఫన్నీ కామెంట్ చేస్తుంటే.. గంటలపాటు నిలబడిన భర్త ప్రేమను అర్థం చేసుకోకుండా స్వార్థంగా భార్య ఎలా నిద్రపోతుందో చూడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో ట్విట్టర్ యూజర్.. ‘అంతిమ ప్రేమ.. ఇది ప్రేమ కాదు. అదంతా భార్య స్వార్థం కాకపోతే ఏంటి?. తన భర్త భుజాలపై తలపెట్టి నిద్రపోతే బాగుండేది.. ఇదేనా ప్రేమంటే..’ అంటూ కామెంట్ పెట్టారు.