Tiger attack: పులిని ఫోటో తీద్దామని వెళ్లాడు.. పంజాతో కొడితే.. |Man Ticks Off Leopard In Photo Attempt, Escapes With Leg Injury

Tiger attack: పులిని ఫోటో తీద్దామని వెళ్లాడు.. పంజాతో కొడితే..

క్లోజ్ ఫోటోకోసమని చిరుత దగ్గరికి వెళ్తే అది ఊరుకుంటుందా.. ఒక్కసారిగా ఫొటో తీసేందుకు వెళ్లిన వ్యక్తిపై దాడికి దిగింది.. ఊహించని దాడితో కంగుతిన్న సదరు వ్యక్తి దాడిని ప్రతిఘటించే ప్రయత్నం ...

Tiger attack: పులిని ఫోటో తీద్దామని వెళ్లాడు.. పంజాతో కొడితే..

Tiger attack: క్లోజ్ ఫోటోకోసమని చిరుత దగ్గరికి వెళ్తే అది ఊరుకుంటుందా.. ఒక్కసారిగా ఫొటో తీసేందుకు వెళ్లిన వ్యక్తిపై దాడికి దిగింది.. ఊహించని దాడితో కంగుతిన్న సదరు వ్యక్తి దాడిని ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు.. అయినా చిరుత అతని కాలును అందుకుంది.. ఇక అతమీ పని అయిపోయిందనుకుంటున్న క్రమంలో అటవీ శాఖ అధికారులు పులిని శాంతింపజేశారు.. ఈ ఘటన అస్సాంలోని దిభ్రూషుర్‌లోని ఖర్జన్ టీ‌ఎస్టేట్‌లో చోటు చేసుకుంది.

Tiger Attack : ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం.. ఆందోళనలో రైతులు

చబువా బైపాస్‌లోని కల్వర్టులో మగ చిరుతపులి ఉన్నట్లు అటుగా వస్తున్న బాటసారులు గుర్తించారు. ఈ వార్త స్థానిక గ్రామస్తులకు చేరడంతో వారంతా పులిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. దినసరి కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అటుగా వస్తున్నాడు. చిరుతపులి ఉందని తెలిసి స్పాట్‌కు చేరుకున్నాడు. అంతటితో ఆగకుండా చిరుతను సెల్ ఫోన్‌లో ఫొటోలు తీయడం ప్రారంభించాడు. ఫొటో సరిగా రాలేదని చిరుతను దగ్గరిగా ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. చిరుత ఒక్కసారిగా ఫొటో తీసే వ్యక్తిపై దాడికి దిగింది. అకస్మాత్తు దాడితో సదరు వ్యక్తి కాలుకు గాయమైంది. అదే సమయానికి అటవీ శాఖ అధికారులు అక్కడికి రావడంతో చిరుతను శాంతింపజేశారు.

Tigers Attack On Cows : ఖమ్మం జిల్లా వాసులను వణికిస్తున్న పులుల సంచారం

చిరుత పులి వెంబడించడంతో ప్రజలు భయంతో పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తోంది. చివరికి టిన్సుకియా అటవీశాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని చిరుతను బందించారు. ఈ సందర్భంగా వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు చెందిన పశువైద్యుడు ఖనిన్ చాంగ్‌మై మాట్లాడుతూ.. చిరుతపులి గురించి సమాచారం అందుకున్న తరువాత, టిన్సుకియా అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. మేము చిరుతపులిని శాంతింపజేసి టిన్సుకియాకు తీసుకువెళ్లాము. ఆరోగ్య పరీక్షల తరువాత అడవిలోకి వదిలేస్తామని తెలిపాడు. ఈ సంఘటన గురించి అటవీ అధికారి మాట్లాడుతూ.. అస్సాంలో జనావాసాల్లోకి జంతువులు తరచుగా జరుగుతున్నాయని అన్నారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో ఇలా జరుగుతుందని పేర్కొన్నారు.

×