West Bengal : అంబులెన్స్ కు డబ్బుల్లేక.. బ్యాగ్ లో కుమారుడి మృతదేహంతో బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణించిన తండ్రి

దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని దేవశర్మ నిర్ణయించుకున్నాడు. అందుకోసం అంబులెన్స్ కోసం వెళ్లగా డ్రైవర్లు 8 వేల రూపాయలను డిమాండ్ చేశారు.

West Bengal : అంబులెన్స్ కు డబ్బుల్లేక.. బ్యాగ్ లో కుమారుడి మృతదేహంతో బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణించిన తండ్రి

Heart Breaking Incident

Heart Breaking Incident : పశ్చిమ బెంగాల్ లో హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ కు డబ్బులు ఇవ్వలేక ఓ వ్యక్తి చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్ లో పెట్టుకుని 200 కిలోమీటర్ల మేర బస్సులోనే ప్రయాణించారు. కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మ అనే వ్యక్తి వలస కార్మికుడు. అతనికి ఐదు నెలల వయసు కలిగిన కవల పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కవల పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.

దీంతో వారిని కలియాగంజ్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చిన్నారులను సిలిగురిలోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందిన ఒక చిన్నారి ఆరోగ్యం కాస్తా మెరుగుపడింది. దీంతో ఆ చిన్నారిని దేవశర్మ భార్య గురువారం ఇంటికి తీసుకెళ్లారు. అయితే అక్కడే చికిత్స పొందుతున్న మరో చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో గత శనివారం చనిపోయారు.

Son Body On Shoulders: అంబులెన్స్ ఏర్పాటు చేయని ఆస్పత్రి.. కొడుకు శవాన్ని వర్షంలో భుజాలపైనే మోసిన తండ్రి

దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని దేవశర్మ నిర్ణయించుకున్నాడు. అందుకోసం అంబులెన్స్ కోసం వెళ్లగా డ్రైవర్లు 8 వేల రూపాయలను డిమాండ్ చేశారు. అయితే అంత డబ్బు అతని దగ్గర లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని సంచిలో దాచి పెట్టుకుని బస్టాండ్ కు వెళ్లాడు. మృతదేహాన్ని సంచిలో దాచి సుమారు 200 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణించి కలియాగంజ్ చేరుకున్నాడు. అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నాడు.

ఈ ఘటనపై చిన్నారి తండ్రి దేవశర్మ మాట్లాడుతూ ఆరు రోజుల చికిత్స తర్వాత తన ఐదు నెలల బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కావాలని ఆస్పత్రి సిబ్బందిని అడిగానని చెప్పారు. ఇందుకోసం అంబులెన్స్ డ్రైవర్లు 8 వేల రూపాయలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచుకుని బస్సులో వెళ్లానని చెబుతూ వాపోయారు.