Punjab : లక్కున్నోడు..రూ. 100 లాటరీతో కోటీశ్వరుడైన కూలీ!

కేవలం రూ. 100తో లాటరీ టికెట్ కొని...కోటీశ్వరుడు అవడంతో..ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Punjab : లక్కున్నోడు..రూ. 100 లాటరీతో కోటీశ్వరుడైన కూలీ!

Lottery punjab

Lottery Ticket : అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం లాటరీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే..అదృష్టం అనేది కొంతమందికి మాత్రమే వస్తుంటుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులయిపోతుంటారు. ఒక్కసారైనా అదృష్టం తలుపు తట్టదా ? అంటూ ప్రయత్నాలు మానరు. ఇలాగే ఓ కూలీ విషయంలో జరిగింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.

నక్క తోక తొక్కిండు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు. కేవలం రూ. 100తో లాటరీ టికెట్ కొని…కోటీశ్వరుడు అవడంతో..ఆ కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లా అకోట గ్రామానికి చెందిన బోదరాజు అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. ఏప్రిల్ 14వ తేదీన రూ. 100 పెట్టి లాటరీ కొన్నాడు. లూథియానాలో న్యాయ నిర్ణేతల సమక్షంలో డ్రా జరిగింది. అందులో బోదరాజు కొన్ని లాటరీకి అదృష్టం వరించింది. రూ. కోటి గెలుచుకున్నాడు.

ఈ విషయాన్ని లాటరీల నిర్వహకుడు అశోక్..బోదరాజుకు తెలియచేశారు. త్వరలోనే నగదు అందిస్తామని అతను వెల్లడించాడు. ఈ సందర్భంగా..తనకు లాటరీ వచ్చిందన్న కుటుంబసభ్యులకు తెలిపాడు. భార్య, ఇద్దరు కూతుళ్లతో ఆనందాన్ని పంచుకున్నాడు. వచ్చే డబ్బుతో పిల్లలకు మంచి చదువు చెప్పిస్తానని బోదరాజు చెప్పాడు.

Read More : Kejriwal Letter Modi : ఢిల్లీ కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, బెడ్ల కొరత తీర్చండి.. ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్ లేఖ