Governor Tamilisai Tributes To Elephant : ఆలయ ఏనుగు మృతి .. నివాళులర్పించిన తెలంగాణ గవర్నరు తమిళిసై

పుదుచ్చేరిలో మణకుళ వినాయక ఆలయంలో ఏనుగు మృతి చెందింది. తెలంగాణ గవర్నరు తమిళిసై నివాళులర్పించారు.

Governor Tamilisai Tributes To Elephant : ఆలయ ఏనుగు మృతి .. నివాళులర్పించిన తెలంగాణ గవర్నరు తమిళిసై

Telangana Governor Tamilisai Tributes To Elephant

Telangana Governor Tamilisai Tributes To Elephant : ప్రముఖ దేవాలయాల్లో ఉండే గజరాజులు చాలా ప్రత్యేకమైనవి. దేవాలయంలో కొలువైన భగవంతుడిని ఎంత భక్తితో భక్తులు కొలుస్తారో..ఆ దేవాలయానికి సంబంధించిన ఏనుగులను కూడా భక్తులు అంతే భక్తితో కొలుస్తారు. దేవాలయానికి చెందిన ఏనుగులు మృతి చెందితో సంప్రయం ప్రకారంగా వాటి అంత్యక్రియలు చేస్తారు. అటువంటిదే జరిగింది పుదుచ్చేరిలోని ఓ దేవాలయంలో. పుదుచ్చేరిలో మణకుళ వినాయక ఆలయంలోని ‘లక్ష్మీ’అనే ఏనుగు మృతి చెందింది. లక్ష్మీని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. లక్ష్మితో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో తమిళిసై స్వయంగా పుదుచ్చేరి మణకుళ వినాయక ఆలయానికి వెళ్లి లక్ష్మికి నివాళులు అర్పించారు.

పుదుచ్చేరిలో మణకుళ వినాయక ఆలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి ఐదేళ్ల వయస్సున్న ఓ ఏనుగు పిల్లను 1955లో దాతలు కానుకగా ఇచ్చారు. దానికి లక్ష్మి అను పేరు పెట్టారు ఆలయ నిర్వాహకులు. అప్పటినుంచి నుంచి ఆలయ సేవల్లో పాల్గొన్న లక్ష్మీ భక్తులకు ఎంతో చేరువైంది. లక్ష్మిని చూడనిదే ఆశీర్వాదం తీసుకోనిదే భక్తులు వెళ్లరు. అలా భక్తులకు లక్ష్మి చాలా ఇష్టంగా మారిపోయింది. ఈక్రమంలో లక్ష్మి కాలికి గాయమైంది. అదికాస్తా పుండుగా మారింది.ఆ పుండుతో లక్ష్మి చాలా బాధపడేది. వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో బుధవారం (నవంబర్ 30,2022)తెల్లవారుజామున లక్ష్మిని నడక కోసం తీసుకువెళ్లగా దారిలోనే కుప్పకూలిపోయింది.

దీంతో ఆయల నిర్వాహకులు హుటాహుటినా డాక్టర్లను రప్పించారు. డాక్టర్లు ఏనుగును కాపాడేందుకు పలు ప్రయత్నాలు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఆలయం ఎదుట కళేబరాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మీ మరణవార్త తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ ..పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ లక్ష్మి వదద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఆలయానికి వెళ్లిన సందర్భాల్లో లక్ష్మీతో తనకున్న అనుబంధాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు తమిళిసై.