Mandarin ducks : బ్యూటిఫుల్.. వందేళ్ల తర్వాత.. ఆనంద్ మహీంద్రా మనసు దోచిన అరుదైన జీవి

ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. దేశ విదేశాల్లోని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Mandarin ducks : బ్యూటిఫుల్.. వందేళ్ల తర్వాత.. ఆనంద్ మహీంద్రా మనసు దోచిన అరుదైన జీవి

Mandarin Ducks

Mandarin ducks : ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. దేశ విదేశాల్లోని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అందులో విజ్ఞానం అందించేవి, వినోదాన్ని కలిగించేవి ఉంటాయి. అంతేకాదు ఆయన ట్వీట్లు ఆలోచింపజేసే విధంగా, స్ఫూర్తిని నింపే విధంగానూ ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ పక్షి(బాతు) అందానికి ఫిదా అయ్యారు. బ్యూటిఫుల్ క్రియేచర్ అని కామెంట్ చేస్తూ ఆ అరుదైన పక్షి వీడియోని ట్వీట్ చేశారు.

మాండరిన్ డక్.. అరుదైన పక్షి… ఇది బాతులాగా నీళ్లలో ఈదగలదు. పక్షిలాగా గాల్లో ఎగరగలదు. దాదాపు వందేళ్ల తర్వాత భారత్ లోని అసోంలో మళ్లీ కనిపించింది. అంతరించి పోయింది అనుకున్న తరుణంలో మాండరిన్ డక్ మళ్లీ కనిపించి కనువిందు చేసింది. ఈ పక్షి అందానికి మహీంద్రా ఫిదా అయ్యారు. ఆ బాతు మహీంద్రా మనసు దోచుకుంది. ఈ పక్షి వీడియోను మహీంద్రా ట్వీట్ చేశారు. అందమైన క్రియేచర్. ప్రకృతి అందించిన గొప్ప వరం. ఆ పక్షి మళ్లీ తిరిగి రావడం చాలా ఆనందం కలిగించే విషయం. ఈ నేచర్ ఎంతో అద్భుతం అంటూ ట్వీట్ చేశారాయన.

ఈ అరుదైన పక్షి వీడియోని ప్రముఖ పర్యావరణ వేత్త ఎరిక్ సైతం ట్వీట్ చేశారు. మాండరిన్ బాతు అరుదైన జాతి పక్షి. బాతులానే ఉంటుంది. నీళ్లలో ఈదుతుంది. పక్షిలా గాల్లో ఎగురుతుంది. సాధారణంగా ఈస్ట్రన్ చైనా, రష్యాలో కనిపిస్తుంది. అలాంటి అరుదైన పక్షి వందేళ్ల తర్వాత మళ్లీ భారత్ లోని అసోంలో కనిపించడం నిజంగా ఆనందం కలిగిస్తోందని ట్వీట్ చేశారాయన.

మాండరిన్ బాతు అరుదైన పక్షి. చాలా ప్రెట్టిగా ఉంటుంది. అరుదైన వాటర్ బర్డ్. సాధారణ బాతులకు భిన్నంగా ఈ పక్షి చెట్లలో నివాసం ఏర్పాటు చేసుకుంటుందని వైల్డ్ లైఫ్ వెబ్ సైట్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ తెలిపింది. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ కు నిమిషాల వ్యవధిలోనే వేల లైకులు, వందల రీట్వీట్స్ వచ్చాయి. కొన్ని సార్లు ఇతర ప్రపంచం నుంచి అందమైన, ప్రేమించే అతిథులు మన దగ్గరికి వస్తుంటాయి. ప్రకృతి ఎంతో దయగలది. ఎలా బ్యాలెన్స్ చేయాలో ప్రకృతికి బాగా తెలుసు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.