One Crore Lottery : అదృష్టవంతుడు.. 100 రూపాయలతో కోటీశ్వరుడైన సెక్యూరిటీ గార్డు

అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ, ఒక్కసారి పలకరించిందంటే మాత్రం.. జీవితమే మారిపోతుంది. కటిక పేదవాడు కూడా ధనికుడు అయిపోతాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుతాడు. ఓ నిరుపేద సెక్యూరిటీ గార్డు విషయంలో ఇదే జరిగింది. ఓ వంద రూపాయలు అతడి జీవితాన్నే మార్చేసింది. కష్టాలన్నీ దూరం చేస్తూ కోటీశ్వరుడిని చేసింది.

One Crore Lottery : అదృష్టవంతుడు.. 100 రూపాయలతో కోటీశ్వరుడైన సెక్యూరిటీ గార్డు

One Crore Lottery

One Crore Lottery : అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ, ఒక్కసారి పలకరించిందంటే మాత్రం.. జీవితమే మారిపోతుంది. కటిక పేదవాడు కూడా ధనికుడు అయిపోతాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుతాడు. ఓ నిరుపేద సెక్యూరిటీ గార్డు విషయంలో ఇదే జరిగింది. ఓ వంద రూపాయల లాటరీ అతడి జీవితాన్నే మార్చేసింది. కష్టాలన్నీ దూరం చేస్తూ కోటీశ్వరుడిని చేసింది.

కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ గార్డుకు లాటరీలో రూ.కోటి వరించింది. వారానికి ఐదుగురికి రూ.కోటి చొప్పున బహుమతి మొత్తం లభించే కేరళ భాగ్యమిత్ర లాటరీ అతనికి తగిలింది. మంగళూరులో ఓ భవనం దగ్గర సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్న మోయిద్దీన్‌ కుట్టి స్వస్థలం కేరళ. కుటుంబంతో కలిసి ఉపాధి కోసం ఏళ్ల కిందట వచ్చాడు. అతనికి రోజూ లాటరీ టికెట్‌ కొనే అలవాటు ఉంది. ఏప్రిల్‌ 4న రూ.100కు కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ కొన్నాడు. లాటరీ టికెట్ కొనేందుకు కుట్టి దగ్గర డబ్బులు లేవు. దీంతో తనకు తెలిసిన వ్యక్తి దగ్గర రూ.500 అప్పుగా తీసుకున్నాడు. అందులో 100 రూపాయలతో కేరళలోని కాసర్ గడ్ జిల్లా ఉప్పలలో ఓ షాపులో లాటరీ టికెట్ కొన్నాడు. అదృష్టం వరించి ఐదు మందికి రూ.కోటి చొప్పున లాటరీ తగిలింది. అందులో మోయిద్దీన్‌ ఒకరు.

తనకు కోటి రూపాయల ప్రైజ్ మనీ తగిలిందనే విషయం తెలియగానే మోయిద్దీన్ ఆనందంగా ఫీల్ అయ్యాడు. తన కష్టాలన్నీ తీరినట్టే అని చెప్పాడు. ప్రస్తుతం పూట గడవటం కూడా కష్టంగా ఉందన్నాడు. అరకొర జీతంతో కుటుంబాన్ని పోషించడం భారంగా ఉందన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని రీతిలో కోటి రూపాయల లాటరీ తగలడాన్ని అతడి నమ్మలేకపోతున్నాడు. కాగా, డబ్బులు చేతికి రాగానే తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి తిరిగి కేరళకు వెళ్లిపోతానని, అక్కడ హాయిగా జీవిస్తానని మోయిద్దీన్ చెప్పారు.