Manipur Congress: కాంగ్రెస్ పార్టీకి 8మంది ఎమ్మెల్యేలు రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహుర్తం కూడా దాదాపుగా ఫిక్స్ చేసుకున్న కౌశిక్ రెడ్డి, బుధ‌వారం(21 జులై 2021) మధ్యాహ్నం తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించారు.

Manipur Congress: కాంగ్రెస్ పార్టీకి 8మంది ఎమ్మెల్యేలు రాజీనామా

Mani Cong

BJP vs Congress: దేశవ్యాప్తంగా కమలం దెబ్బకు కకావికలం అవుతోన్న కాంగ్రెస్.. ఈశాన్య రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదర్కొంటోంది. లేటెస్ట్‌గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, మణిపూర్‌లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గోవిందస్ కొంతోజమ్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. కొంతోజమ్ 6 సార్లు విష్ణుపూర్ సీటు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కొంతోజమ్‌ను 2020 డిసెంబర్‌లో మణిపూర్ యూనిట్ చీఫ్‌గా నియమించారు.

వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తానని ఆయన ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పూడ్చలేని నష్టమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కొంతౌజమ్ సడెన్‌గా పార్టీ మారడంతో అసలు ఎమైంది అనే విషయం అర్థం కావట్లేదు. గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.