Manipur iron womens : వెయిట్​లిఫ్టింగ్​ లో​ మణిపూర్ ఉక్కు మహిళలు

భారత్ లోని మణిపూర రాష్ట్రంలో మహిళా మణిపూసలకు కొదవలేదు. కష్టపడే తత్వం, పేదరికాన్ని ఎదిరించి అనుకున్నది సాధించటంలో మణిపూర్ మహిళలు మహా పట్టుదల కలవారని నిరూపించారు. బాక్సర్ మేరీ కోమ్ ప్రస్తానం గురించి చెప్పనక్కరలేదు. 14 ఏళ్లకే వెయిట్ లిఫ్టింగ్ లో ప్రతిభ కనబరిచిన కుంజరాణి దేవి. అనితాచాను ఇలా వెయిట్ లిఫ్టింగ్ లకు మణిపూర్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.ఈశాన్య రాష్ట్రం అయినా వెనుకబడిని రాష్ట్రం అయినా మణిపూర్ వెయిట్​ లిఫ్టింగ్​కి చిరునామాగా నిలుస్తోంది. అనితా చాను, కుంజరాణిదేవి, మీరాబాయి చాను వంటివాళ్లు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. దాంట్లో భాగంగానే జపాన్ లోని టోక్యో జరిగిన ఒలింపిక్స్ లో మీరాబాయి ఛాను రజత పతకాన్ని సాధించింది.

10TV Telugu News

Manipur iron womens in weightlifting : ‘వెయిట్​ లిఫ్టింగ్​’ అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చే మహిళ కరణం మల్లీశ్వరి. అప్పుడు అంటే 20 ఏళ్ల కిందట చైనాలో జరిగిన ఒలింపిక్స్ లో కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్ లో పతకం సాధించిన మొట్ట మొదటి భారతీయురాలిగా ఈ తెలుగమ్మాయి రికార్డ్​ సృష్టించింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ కరణం భారత కాంతికిరణంగా వెలిగింది. ఆ హిస్టరీని ఇప్పుడు మణిపూర్​ ఆడపిల్లలు కొనసాగిస్తున్నారు. మరో మాట చెప్పాలంటే ఆమెను మించిన విజయాలే నమోదు చేస్తున్నారు. ఉమెన్​ వెయిట్​ లిఫ్టింగ్​కి మణిపూర్​ని కేరాఫ్​ అడ్రస్ చేశారు. ఇంటర్నేషనల్​ లెవల్​లో ఇండియాకి పేరు తెస్తున్న ఆ విజేతలు పేదింటి బిడ్డలు కావటం చెప్పుకోదగ్గ విషయం. అటువంటి పేదింటి అమ్మాయి..వంట కోసం కట్టెల మోసుకొచ్చే అమ్మాయి మీరాబాయి చాను నేడు టోక్యో ఒలింపిక్స్ 2020 లో రజత పతకాన్ని సాధించింది. మణిపూర్ కే కాదు యావత్ భారతానికే గర్వకారణంగా నిలిచిందీ మణిపూర్ మణిపూస మీరాబాయి ఛాను. పేదింటినుంచి ఒలింపిక్ లో సత్తా చాటేలా ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నో ఎత్తుపల్లాలు..మరెన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. భారతదేశాన్ని గర్వపడేలా చేసింది.

మణిపూర్​లో మహిళా మణిపూసలకు కొదవలేదు. కష్టపడే తత్వం అక్కడి మహిళల సొత్తు. పేదరికాన్ని ఎదిరించి అనుకున్నది సాధించటంలో మణిపూర్ మహిళలు మహా పట్టుదల కలవారని నిరూపించారు. బాక్సర్ మేరీ కోమ్ ప్రస్తానం గురించి చెప్పనక్కరలేదు. అలాగే 14 ఏళ్లకే వెయిట్ లిఫ్టింగ్ లో ప్రతిభ కనబరిచిన కుంజరాణి. అనితాచాను ఇలా వెయిట్ లిఫ్టింగ్ లకు మణిపూర్ కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.ఈశాన్య రాష్ట్రం అయినా వెనుకబడిని రాష్ట్రం అయినా మణిపూర్ వెయిట్​ లిఫ్టింగ్​కి చిరునామాగా నిలుస్తోంది. అనితా చాను, కుంజరాణిదేవి, మీరాబాయి చాను వంటివాళ్లు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారు. పతకాల పంట పండిస్తున్నారు. దాంట్లో భాగంగానే జపాన్ లోని టోక్యో జరిగిన ఒలింపిక్స్ లో మీరాబాయి ఛాను రజత పతకాన్ని సాధించింది.

బరువుల రాణి కుంజరాణికి పరుగుల రాణి పీటీ ఉష స్ఫూర్తి ​
కుంజరాణిదేవి 14 ఏళ్ల వయసప్పుడు (1982లో) ఏషియన్​ గేమ్స్​ జరుగుతున్నాయి. అప్పుడే కుంజరాణి ఇంటిలో టీవీ కొన్నారు. మన దేశంలో కలర్​ లైవ్​ టెలికాస్ట్​ అయిన బిగ్​ ఈవెంట్​ అదే. ఆ పోటీలు 16 రోజుల పాటు టీవీలో లైవ్ వచ్చాయి. మన దేశం నుంచి పాల్గొన్న పరుగుల రాణి పీటీ ఉష రెండు సిల్వర్​ మెడల్స్​ సొంతం చేసుకుంది. ఆమె ఆట చూసి కుంజరాణి ఆశ్చర్యపోయింది. ఎంత సత్తా ఆమెది అని మురిసిపోయింది. నేను కూడా ఏదో సాధించాలని ఆ చిన్నారి మనస్సులో ముద్ర పడిపోయింది. పీటీ ఉషలాగా తాను కూడా ప్లేయర్​ కావాలని అనుకుంది. కానీ అది ఎలాగో ఆ చిన్నారికి అర్థం కాలేదు. అయినా సరే అదే ఆలోచనలోనే ఉండేది. పీటీ ఉష ఎంత పొడుగో..నేను చూస్తే ఇంత పొట్టిగా ఉంటా..నాకు అది సాధ్యమేనా అని ఆమె అనుకునేది. అలా ఆమె ఎత్తు చాలా ఆటలకు ఆటంకంగా మారింది. కానీ పట్టుదల ఉండాలేగానీ..పొడుగు..పొట్టి తేడా ఉండదు..మనకుఅనుగుణంగా ఏదోక దాంట్లో ప్రతిభ చూపించాలని అనుకుంది.

అలా వెయిట్ లిఫ్టింగ్ వైపు ఆలోచనలు మళ్లాయి. దీనికి ఎత్తుతో సంబంధం లేదు. అంతా బలంతోనే. దాంతో కుంజరాణి వెయిట్​లిఫ్టింగ్​ని ఎంచుకుంది. 1983లో అనితా చాను అనే మరో అమ్మాయితో కలిసి కుంజరాణి వెయిట్​లిఫ్టింగ్​లో కోచింగ్​ తీసుకుంది. వీళ్లిద్దరూ పగలనగా రాత్రనకా, ఎండావానా లెక్కచేయకుండా గెలుపే శ్వాసగా కసరత్తులు చేసేవారు. వారి పట్టుదల చూసి వీరు ఏదో సాధిస్తారని అనుకునేవారు చూసేవారంతా. కానీ అప్పట్లో ఆటలకు ప్రభుత్వాలు నిధులు కేటాయించేవారు కాదు. ఎటువంటి ప్రోత్సాహాలు ఉండేవి కాదు. ఇటుచూస్తే ఆర్థిక కష్టాలు. అటు చూస్తే ప్రభుత్వాల నుంచి ఎటువంటి తోడ్పాటు లేదు. ఇటువంటి కష్టాలను కూడా ఎదుర్కొని అనుకున్నది సాధించారు. చాంపియన్లుగా నిలిచారు. అప్పులు చేసి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేవారు.

అదే సంవత్సరం కుంజరాణి పవర్​లిఫ్టింగ్​లో నేషనల్​ రికార్డ్​ క్రియేట్ చేసింది. రెండేళ్ల తర్వాత (1985లో) అనితా చాను.. వియన్నాలో జరిగిన వరల్డ్​ చాంపియన్​షిప్​లో ఇండియా తరఫున పాల్గొంది. కుంజరాణి ఒలింపిక్స్​లో పాల్గొనాలనుకుంది కానీ, ఒలింపిక్స్​లో పవర్​ లిఫ్టింగ్​ విభాగమే లేదు అప్పట్లో. అదే ఏడాది మన దేశంలో సమ్మర్​ ఒలింపిక్స్​ తరహాలో నేషనల్​ గేమ్స్​ ఆరంభించి, దానిలో ఉమెన్​​ వెయిట్​లిఫ్టింగ్​కి చోటు కల్పించారు. మాకోసమే ఇటువంటి అవకాశం వచ్చిందని సంతోషంతో ఆ అవకాశాన్ని కుంజరాణి, అనిత చాను చక్కగా వాడుకున్నారు. కుంజ మూడు కేటగిరీల్లో గోల్డ్​ మెడల్స్​​ తెచ్చుకుంది.

1989 నాటికి కుంజరాణి దేశంలోనే పాపులర్​ స్పోర్ట్స్ ​ఉమెన్ గా పేరు తెచ్చుకుంది. మాంచెస్టర్​లో జరిగిన వరల్డ్​ వెయిట్​లిఫ్టింగ్​ చాంపియన్​షిప్​లో మూడు సిల్వర్​ మెడల్స్​ సాధించింది. 1990, 94 ఆసియన్​ గేమ్స్​తోపాటు 2006 కామన్వెల్త్​ గేమ్స్​లో ‘బ్రాంజ్’ గెలిచింది. మొత్తమ్మీద 68 ఇంటర్నేషనల్​ మెడల్స్​ సొంతం చేసుకుంది కుంజరాణి. ఆమె విజయాలకు, సేవలకు గుర్తుగా ప్రభుత్వం అర్జున, రాజీవ్ ​ఖేల్​రత్న అవార్డులను అందజేసింది. 2011లో పద్మశ్రీ కూడా వరించింది. తద్వారా ఆమె ఎందరో అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచింది.

కొత్త కెరటం మీరాబాయి

అనిత చాను, కుంజరాణిల తర్వాత మణిపూర్​ నుంచి కొత్త కెరటం వచ్చింది. ఆమె పేరు.. మీరాబాయి చాను. వెయిట్​ లిఫ్టింగ్​ ప్రపంచంలోకి ఆమె ఎంట్రీ అనుకోకుండా జరిగింది. ఆర్చరీలో ట్రైనింగ్​ కోసం వచ్చిన మీరాబాయి చివరికి బరువులు ఎత్తడాన్ని బాగా వంట బట్టించుకుంది. మీరాబాయిలో టాలెంట్​ను గుర్తించిన కోచ్​ ఆ విషయాన్నే ఆమె పేరెంట్స్​కి చెప్పాడు. ఎంకరేజ్​ చేస్తే అద్భుత విజయాలను సాధిస్తుందన్న అంచనాలను నిలబెట్టుకుంది. మీరాబాయికి మొదటి కోచ్​ అనిత చాను కావటం విశేషం.

2009లో చత్తీస్​గఢ్​ యూత్​ చాంపియన్​షిప్​లో మొదటి మెడల్​ సాధించిన మీరాబాయి ఐదేళ్లలో అందనంత ఎత్తుకు ఎదిగింది. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్​ గేమ్స్​లో ‘సిల్వర్​’​ సొంతం చేసుకునే స్థాయికి చేరింది. 2016లో 192 కేజీల బరువెత్తి గతంలో కుంజరాణి సృష్టించిన 190 కేజీల రికార్డును బ్రేక్​ చేసింది. 2018లో ‘రాజీవ్​ ఖేల్​రత్న’ గెలుచుకుంది. 2016 రియోడీజెనిరో సమ్మర్​ ఒలింపిక్స్​లో ఫెయిల్​ అయినా 2017లో వరల్డ్​ ఛాంపియన్​షిప్​లో ‘గోల్డ్’తో మెరిసింది. మల్లీశ్వరి తర్వాత ఆ ఘనత సాధించిన రెండో అమ్మాయిగా చరిత్ర లిఖించింది.

మీరాబాయి చాను ప్రస్థానం ఆ తర్వాత కొనసాగింది. 2018 కామన్వెల్త్​ గేమ్స్​లో, 2019లో థాయ్​లాండ్​లో జరిగిన ఈజీఏటీ కప్‌లోనూ బంగారు పతకాలను సొంతం చేసుకుంది. అంతా అనుకున్నట్లే సాగింది. టోక్యో 2020 ఒలింపిక్స్ లో మీరాభాయి ఛాను సత్తా చాటింది. రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ లో మణిపూర్​ ధీటుగా సమాధానం చెబుతోంది. వెయిట్​లిఫ్టింగ్​లో అమ్మాయిలు ఎప్పటికప్పుడు కొత్త చరిత్రలు సృష్టిస్తున్నారు.

10TV Telugu News