Manipur Violence: మణిపూర్‌లో ఆగని హింస.. భదత్రా సిబ్బంది వేషధారణలో మిలిటెంట్లు.. సెర్చ్ ఆపరేషన్ పేరుతో ముగ్గురిని కాల్చివేత
మే3న మణిపూర్‌లో షెడూల్డ్ తెగ (ఎస్టీ) హోదాకోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టిన తరువాత రెండు వర్గాల మధ్య ఘర్షణలతో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం విధితమే.

Manipur Violence
Manipur Violence: మణిపూర్ (Manipur) లో హింస ఇంకా చల్లారలేదు. మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లా (Imphal West District) లోని ఓ గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం సమయంలో మిలిటెంట్లు (Militants) భద్రతా సిబ్బంది (Security personnel) వేషధారణలో వచ్చి సెర్చ్ ఆపరేషన్ (Search operation) సాకుతో కొంతమందిని ఇంటి నుంచి బయటకు పిలిచారు. ఆ తరువాత వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్‌పోకి, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల సరిహద్దులోని ఖోకెన్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మిలిటెంట్లు మెయిటీ (Meitei) వర్గానికి చెందిన వారుగా భావిస్తున్నారు.
Manipur Violence: మణిపూర్ అల్లర్లపై ఆరు కేసులు నమోదు.. విచారణ వేగవంతం చేసిన సీబీఐ
ఈ ఘటన కాంగ్‌పోక్‌పి (Kongpokp), ఇంఫాల్ పశ్చిమ జిల్లా (Imphal West District) ల సరిహద్దులోని ఖోకెన్ గ్రామం (Khoken Village) లో జరిగింది. మిలిటెంట్లు మెయిటీ వర్గానికి చెందిన వారుగా భావిస్తున్నారు. తుపాకీ శబ్దం రాగానే భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే భద్రతా దళాల వేషదారణలో వచ్చిన మిలిటెంట్లు పరారయ్యారు. ముగ్గురి మృతదేహాలను అస్సాం రైపిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపి ముగ్గురు వ్యక్తుల మరణానికి కారణమైన వారికోసం మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
మే3న మణిపూర్‌లో షెడూల్డ్ తెగ (ఎస్టీ) హోదాకోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా గిరిజన సంఘీభావ యాత్ర చేపట్టిన తరువాత రెండు వర్గాల మధ్య ఘర్షణలతో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం విధితమే. ఈ హింసాకాండలో ఇప్పటివరకు దాదాపు 100 మందికిపైగా మరణించారు. మరో 300 మందికి గాయాలయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఆర్మీ సిబ్బందితో పాటు, అస్సాం రైఫిల్స్ కు చెందిన దాదాపు పదివేల మంది సైనికులను రంగంలోకి దింపింది.