Manipur Violence: మణిపూర్‌లో దారుణం.. అంబులెన్సుకు నిప్పంటించిన అల్లరిమూకలు.. ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

పునరావాస కేంద్రంలో ఎనిమిదేళ్ల బాలుడు టోన్సింగ్ తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో తుపాకీ శబ్దం వినిపించింది. తుపాకీ నుంచి వచ్చిన తూటా బాలుడి తలకు తగిలింది.

Manipur Violence: మణిపూర్‌లో దారుణం.. అంబులెన్సుకు నిప్పంటించిన అల్లరిమూకలు.. ఎనిమిదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

Manipur Violence

Manipur Violence: మణిపూర్‌ (Manipur) లో దారుణ ఘటన (Atrocious incident) చోటు చేసుకుంది. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ (ambulance) పై అల్లరి‌మూక నిప్పు పెట్టారు. దీంతో అంబులెన్సులో ఉన్న బాలుడితో సహా అతడి తల్లి, బంధువు మరణించారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో మీనా హాంసింగ్ (45), ఆమె కుమారుడు టోన్సింగ్ (8), వారి బంధువు లిడియా (37) ఉన్నారు. వీరు అస్సాం రైఫిల్స్ రిలీఫ్ క్యాంపులో ఉంటున్నారు. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండటంతో వీరు గత కొంతకాలంగా పునరావాస కేంద్రంలో ఉంటున్నారు.

Manipur violence: మణిపూర్ అల్లర్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

పునరావాస కేంద్రంలో ఎనిమిదేళ్ల బాలుడు టోన్సింగ్ తోటి పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో తుపాకీ శబ్దం వినిపించింది. తుపాకీ నుంచి వచ్చిన తూటా బాలుడి తలకు తగిలింది. ఇది గమనించిన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. బాలుడికి బులెట్ తగలడంతో తల్లి తల్లడిల్లింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమైన అంబులెన్సుని పిలించి అందులో చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భద్రతా దళాలు కొంతదూరం రాగా, ఆ తరువాత మణిపూర్ పోలీసులకు బాధ్యతను అప్పగించారు. కొద్దిదూరం వెళ్లగానే అల్లరిమూకలు అంబులెన్సుకు నిప్పంటించాయి.

Austrian Train Fire Breaks Out: ఆస్ట్రియన్ రైలులో చెలరేగిన మంటలు..45 మంది ప్రయాణికులకు గాయాలు

ఒక్కసారిగా మంటలు అంబులెన్సును చుట్టుముట్టడంతో అంబులెన్సు సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడగా.. హాంసింగ్, టోన్సింగ్, లిండియా ముగ్గురు మంటల్లోనే అంబులెన్సులో సజీవదహనం అయ్యారు. కాంగ్‌చుప్ ప్రాంతంలో అనేక కుకీ గ్రామాలు ఉన్నాయి. ఇది ఇంఫాల్ వెస్ట్‌తో కాంగ్‌పోక్పి జిల్లా సరిహద్దులో ఉంది. ఇది ఫాయోంగ్‌లోని మెయిటీ గ్రామానికి దగ్గరగా ఉంది. మే 27 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెండవ దఫా హింసాకాండలో ఈ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదాకోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్ కు వ్యతిరేకంగా మే3న కొండ జిల్లాలో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఆ తరువాత ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి.