Manish Sisodia: కరుడుగట్టిన నేరస్థుల మధ్య మనీశ్ సిసోడియా..! ఆప్ ఆరోపణలపై స్పందించిన తీహార్ జైలు అధికారులు ..

ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తీహార్ జైలులో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Manish Sisodia: కరుడుగట్టిన నేరస్థుల మధ్య మనీశ్ సిసోడియా..! ఆప్ ఆరోపణలపై స్పందించిన తీహార్ జైలు అధికారులు ..

Manish Sisodia

Manish Sisodia: ఢిల్లీ ఎక్సైజ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. అయితే, తీహార్ జైలులో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తీహార్ జైలులో సిసోడియాను ప్రమాదకరమైన నేరస్థులతో కలిపి ఉంచినట్లు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ అన్నారు. సిసోడియాకు విపాసన సెల్ కూడా నిరాకరించేంతటి పగ ‘ఆప్’పై ప్రధాని మోదీకి ఉందంటూ ఆరోపించారు. మరోవైపు ఆప్ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. మనీశ్ సిసోడియాకు జైలులో మెడిటేషన్ సెల్ ఇవ్వకపోవడాన్ని ఖండించారు.

Manish Sisodia: తీహార్ జైలులో వృద్ధుల సెల్‌లో సిసోడియా.. తొలిరోజు మెనూ ఏమిటంటే?

సిసోడియా తనను మెడిటేషన్ సెల్‌లో ఉంచాలని కోర్టును కోరారని, కోర్టు అనుమతించిందని, కానీ, ఆయన్ను కోర్టు ఆదేశాలనుకూడా లెక్కచేయకుండా తీహార్ జైలు అధికారులు జైలు నెంబర్ -1 లో ఉంచారని ఆరోపించారు. మానసిక అలజడితో బాధపడే నేరగాళ్లు ఆ సెల్‌లో ఉంటారని, ఒక్క సంకేతంతో వారు ఎవరినైనా చంపేస్తారని అన్నారు. ఢిల్లీలో ఆప్‌ను ఓడించలేని బీజేపీ, ఇలాంటి పద్దతుల్లో ప్రత్యర్థులను అంతమొందిస్తుందా అనే అనుమానం వ్యక్తమవుతుందని భయాందోళన వ్యక్తంచేశారు.

Manish Sisodia: మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు

ఆప్ నేతల ఆరోపణలపై తీహార్ జైలుశాఖ స్పందించింది. మనీశ్ సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వార్డులో ఉంచడం జరిగిందని జైలు అధికారులు తెలిపారు. సిసోడియాను సీజే-1 వార్డులో ఉంచారు. అక్కడ తక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారు. గ్యాంగ్‌స్టర్లు ఎవరూ లేరని, మంచి నడవడిక కలిగిన వారు జైలులో ఉన్నారని తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం.. భద్రతకు అన్ని ఏర్పాట్లు చేశామని, బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జైలు అధికారులు స్పష్టం చేశారు. ఇదిలాఉంటే ఢిల్లీ మద్యం పాలసీ కేసు విషయంలో సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసిన విషయం విధితమే. సిసోడియా బెయిలు పిటిషన్‌ శుక్రవారం ( ఈనెల 10న) విచారణకు రానుంది.