Delhi Liquor Scam: భార్య, కుటుంబ సభ్యులను కలిసేందుకు సిసోడియాకు అనుమతి.. కానీ..

భార్య, కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవద్దని చెప్పింది. అంతేకాదు...

Delhi Liquor Scam: భార్య, కుటుంబ సభ్యులను కలిసేందుకు సిసోడియాకు అనుమతి.. కానీ..

Manish Sisodia

Delhi Liquor Scam – Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై హైకోర్టు (Delhi High Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భార్య, కుటుంబ సభ్యులను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.

అదే సమయంలో పలు షరతులు విధించింది. భార్య, కుటుంబ సభ్యులను తప్ప మిగతా ఎవరినీ కలవద్దని చెప్పింది. మీడియాతో మాట్లాడకూడదని, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కూడా వాడకూడదని చెప్పింది. మరోవైపు, ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రేపు సాయంత్రం స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఈడీకి ఆదేశించింది. బెయిల్ పిటిషన్ పై విచారణను జులై 4వ తేదీకి వాయిదా వేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ సహా పలువురి నుంచి సీబీఐ ఇప్పటికే అనేక వివరాలు రాబట్టింది. శరత్ చంద్రారెడ్డి తాజాగా అప్రూవర్ గా మారారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి