Manish Sisodia: మనీష్ సిసోడియాకు సీబీఐ సమన్లు.. లిక్కర్ స్కామ్‌పై సోమవారం విచారణకు రావాలని ఆదేశం

లిక్కర్ స్కామ్‌లో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం జరిగే విచారణకు రావాలని కోరారు.

Manish Sisodia: మనీష్ సిసోడియాకు సీబీఐ సమన్లు.. లిక్కర్ స్కామ్‌పై సోమవారం విచారణకు రావాలని ఆదేశం

Manish Sisodia: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ అధికారులు సమన్లు జరీ చేశారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సోమవారం జరిపే విచారణకు హాజరుకావాలని సూచించారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‪కు పోలీసుల నోటీసులు.. పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్న పవన్.. విశాఖ వదిలి వెళ్తారా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అవకతవకలకు పాల్పడ్డారని మనీష్ సిసోడియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సోమవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ఈ నోటీసులపై మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘మా ఇంట్లో సీబీఐ అధికారులు 14 గంటలు తనిఖీలు నిర్వహించారు. లాకర్లు సోదా చేశారు. కానీ, వారికి ఏమీ దొరకలేదు. ఇంట్లోనే కాదు.. ఊరంత వెతికినా ఏమీ దొరకలేదు. ఇప్పుడు విచారణకు రమ్మని పిలిచారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే విచారణకు హాజరవుతాను. నా పూర్తి సహకారం అందిస్తాను. సత్యమేవ జయతే’’ అని మనీష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Madhya Pradesh: డబ్బు కోసం గూగుల్ మేనేజర్ కిడ్నాప్.. పెళ్లి పేరుతో నాటకం.. రూ.40 లక్షలు డిమాండ్

ఆప్ నేతలే లక్ష్యంగా కొంతకాలంగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక రాష్ట్రాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ ప్రారంభమైంది. అయితే, ఈ దాడులను ఆప్ వ్యతిరేకిస్తోంది. తమ పార్టీ నేతల్ని వేధించేందుకే కేంద్రం సీబీఐని ఉసిగొల్పుతోందని ఆప్ విమర్శిస్తోంది.