మన్ కీ బాత్ : ఓటమి తర్వాత…రష్యన్ టెన్నిస్ ప్లేయర్ స్పీచ్ పై మోడీ ప్రశంసలు…లతాజీకి బర్త్ డే విషెస్

  • Published By: venkaiahnaidu ,Published On : September 29, 2019 / 10:27 AM IST
మన్ కీ బాత్ : ఓటమి తర్వాత…రష్యన్ టెన్నిస్ ప్లేయర్ స్పీచ్ పై మోడీ ప్రశంసలు…లతాజీకి బర్త్ డే విషెస్

ఇవాళ(సెప్టెంబర్-29,2018)మన్ కీ బాత్ 57వ ఎసిపోడ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ..దసరా పండుగ సీజన్ దేశంలో మొదలైన సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ బుంధువులు,కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ దసర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభం అయ్యాయన్నారు. పండుగలవాతావరణం కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో నిండిపోతుందని ప్రధాని మోడీ అన్నారు

ఈ సందర్భంగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు 90వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోడీ. శనివారం లతా మంగేష్కర్‌ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెను అభినందనల్లో ముంచెత్తగా ఒకరోజు ఆలస్యంగా ప్రధాని మోడీ నుంచి ఆమె శుభాకాంక్షలు అందుకున్నారు. తాను ఏడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరేముందు ఆమెకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశానని ప్రధాని గుర్తు చేసుకున్నారు. లతా మంగేష్కర్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఆరోగ్యకర జీవితం గడుపుతూ ఆహ్లాదంగా ఉండాలని, తమను దీవించాలని ఆకాంక్షించారు. గాయని లతాజీ మనందరి కంటే వయసులో పెద్దవారని, దేశంలో భిన్న దశలను వారు చూశారని,వారిని అందరూ దీదీగా గౌరవిస్తారని తెలిపారు. 

 మోడీ తన మన్ కి బాత్ ప్రసంగంలో… యుఎస్ ఓపెన్ ఫైనల్లో  రాఫెల్ నాదల్ చేతిలో ఓడిపోయిన రష్యన్ టెన్నిస్ ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ చేసిన ప్రసంగం చాలా అద్బుతం అని మోడీ ప్రసంగించారు. మెద్వెదేవ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ స్పిరిట్ ను మోడీ ప్రశంసించారు. అందరూ డేనియల్ స్పీచ్ చూడాలని దాని నుంచి కొంత నేర్చుకోవచ్చని మోడీ అన్నారు.డేనియల్ సింస్లిసిటీ,మెచ్యూరిటీని మోడీ ప్రశంసించారు. 
ప్రధాని మోడీ నాదల్ యొక్క వినయాన్ని విజయంలో వినయం చూపిన నాదల్ ని కూడా మోడీ ప్రశంసించారు. ఆ మ్యాచ్ వీడియోను చూడమని యువకులను మోడీ కోరారు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై కూడా ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.  ప్లాస్టిక్ వడకాన్ని నిషేధించడం భారత్ కే కాకుండ ప్రపంచానికి గర్వకారణమైన విషయమని అన్నారు. ఈ పండుగ సీజన్ లో ప్రజలు దేశమంతా ట్రావెల్ చేయాలని ప్రసంగ ముగింపు సమయంలో మోడీ కోరారు.