Mann Ki Baat : ‘మన్ కీ బాత్’ ద్వారా రూ. 30.80 కోట్ల ఆదాయం

తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే.

Mann Ki Baat : ‘మన్ కీ బాత్’ ద్వారా రూ. 30.80 కోట్ల ఆదాయం

Modi (9)

Mann Ki Baat తన మనసులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునేందుకు ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే రేడియో పోగ్రామ్ ‘మన్ కీ బాత్’ అత్యంత ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 78 మన్ కీ బాత్ ప్రోగ్రాం ఎపిసోడ్ లను ప్రసారభారతి ప్రసారం చేసింది. అయితే మన్ కీ బాత్ కేవలం ప్రసిద్ధి పొందడమే కాకుండా ఏకంగా కొన్ని కోట్ల ఆదాయాన్ని కూడా ప్రభుత్వాన్ని తెచ్చి పెట్టిన కార్యక్రమం ఇది.

2014లో ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా కేంద్రానికి 30.80 కోట్ల రూపాయలు వచ్చాయని సోమవారం కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. అయితే ఇందులో 2017-18 సంవత్సర కాలంలోనే అత్యధికంగా రూ. 10.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది.

ఇక 2014-15 లో రూ. 1.16 కోట్లు, 2015-16 లో రూ. 2.81 కోట్లు, 2016-17 లో రూ. 5.14 కోట్లు, 2018-19 లో రూ. 7.47, 2019-20 లో రూ. 2.56 కోట్లు వచ్చినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇక 2020-21 లో 1.02 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రకటించారు.  కాగా, దేశవ్యాప్తంగా కేబుల్ మరియు డీటీహెచ్ ఫ్లాట్ ఫాంలపై దాదాపు 91 ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ని ప్రసారం చేస్తున్నాయి.