హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీ సీఎంగా చౌతాలా ప్రమాణస్వీకారం

  • Published By: venkaiahnaidu ,Published On : October 27, 2019 / 09:33 AM IST
హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీ సీఎంగా చౌతాలా ప్రమాణస్వీకారం

హర్యానాలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ(అక్టోబర్-27,2019)రాజధాని చంఢీఘర్ లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేశారు.  జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు,కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా కూడా ఈ కార్యక్రామానికి హాజరయ్యారు.

దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్ చౌతాలా కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ కుంభకోణం కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన కొడుకు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పెరోల్ పై బయటకు వచ్చారు.

ఈ నెల21న జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో మొత్తం 90స్థానాలకు గాను బీజేపీ 40స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46స్థానాలను సింగిల్ గా దక్కించుకోలేకపోయింది.కాంగ్రెస్ 30తో సరిపెట్టుకుంది. ఇక దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ 10స్థానాల్లో విజయం సాధించి కింగ్ మేకర్ గా అవతరించింది. జేజేపీ,స్వతంత్రుల మద్దుతో 57సంఖ్యాబలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.