సైనిక లాంఛనాలతో ముగిసిన పారికర్ అంత్యక్రియలు

సైనిక లాంఛనాలతో ముగిసిన పారికర్ అంత్యక్రియలు

సైనిక లాంఛనాలతో ముగిసిన పారికర్ అంత్యక్రియలు

క్యాన్సర్ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం(మార్చి-18,2019) సాయంత్రం మిరామర్ బీచ్ లో సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. హిందూ సాంప్రదాయం అంత్యక్రియలు జరిగాయి.బీజేపీ చీఫ్ అమిత్ షా,పలు రాష్ట్రాల బీజేపీ సీఎంలు,పలువురు కేంద్రమంత్రులు మిరామర్ బీచ్ దగ్గర కడసారి పారికర్ కు నివాళులర్పించారు.
Read Also : గోవా సామాన్యుడు…. మచ్చలేని రాజకీయ నాయకుడు

అంతకుముందు ప్రజల సందర్శనార్థం పారికర్ భౌతికకాయాన్ని ఉంచిన కళా అకాడమీ నుంచి మిరామర్ బీచ్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. పారికర్ అంతిమయాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.చివరిసారిగా తమ నాయకుడికి కడసారి వీడ్కోలు పలికారు.

×