విషమంగా పారికర్ హెల్త్ కండీషన్

  • Published By: madhu ,Published On : March 17, 2019 / 07:30 AM IST
విషమంగా పారికర్ హెల్త్ కండీషన్

గోవా సీఎం మనోహర్ పారికర్ హెల్త్ కండీషన్ మరింత విషమించిందని వార్తలు వస్తున్నాయి. దీనితో బీజేపీ అలర్ట్ అయ్యింది. వెంటనే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గోవాకు బయలుదేరారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు..ఇతరత్రా వాటిపై చర్చించేందుకు మార్చి 17వ తేదీ ఆదివారం అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. ఈ చర్చల్లో రాష్ట్రంలోని మూడు నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. పారికర్ ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆయనే తమ నాయకుడని గోవా ఫార్వర్డ్ పార్టీ చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. గవర్నమెంట్‌కు వచ్చిన ఇబ్బంది లేదంటున్నారు. అయితే..బీజేపీ మాత్రం కొత్త సీఎం కోసం అన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు కాంగ్రెస్ పలు విమర్శలు చేస్తోంది. పారికర్ నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారి, అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం ఈ రాష్ట్రంలో 40 సీట్లున్నాయి. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చేయడం.. ఫ్రాన్సిస్ డిసౌజా మరణంతో 37 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక్కడ మెజార్టీ ఉండాలంటే 19 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. బీజేపీకి 13 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. గోవా ఫార్వర్డ్ పార్టీ, ఎంజీపీ, ఎన్సీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.