Newspaper Ad: ఇదేమి వింత.. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని ఓ వ్యక్తి పత్రికా ప్రకటన.. వండర్ అంటున్న నెటిజన్లు

ఇది కచ్చితంగా వింతే! కాకపోతే.. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని తనే పత్రికా ప్రకటన ఇవ్వడం ఏంటి? దీన్ని ఆ పేపర్ వాళ్లు అలాగే ప్రచురించడం ఏంటి! దీనిపై నెటిజన్లు సరదగా స్పందిస్తున్నారు.

Newspaper Ad: ఇదేమి వింత.. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని ఓ వ్యక్తి పత్రికా ప్రకటన.. వండర్ అంటున్న నెటిజన్లు

Newspaper Ad: ప్రపంచంలో ఎక్కడైనా సరే.. ఎవరి డెత్ సర్టిఫికెట్‌ను వాళ్లు చూసుకోలేరు. ఎందుకంటే బతికుండగా డెత్ సర్టిఫికెట్ రాదు. పోయిన తర్వాత వచ్చినా చూసుకోలేరు. అలాంటిది ఒక వ్యక్తి మాత్రం తన డెత్ సర్టిఫికెట్ పోయిందని తనే పత్రికా ప్రకటన ఇచ్చాడు.

Ind vs Aus: ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం ఎవరూ రావొద్దు.. హెచ్‌సీఏ ప్రకటన.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే జారీ

ఇప్పుడీ వింత చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏవైనా డాక్యుమెంట్లు పోయినప్పుడు వాటికి సంబంధించి పత్రికా ప్రకటన ఇస్తారు. పోయిన డాక్యుమెంట్లు దొరుకుతాయని.. లేకపోతే డూప్లికేట్ డాక్యుమెంట్లు పొందడానికి వీలవుతుందని. ఆ సర్టిఫికెట్లలో డెత్ సర్టిఫికెట్ కూడా ఉండొచ్చు. కానీ, ఒకరి సర్టిఫికెట్ కోసం మరొకరు ప్రకటన ఇవ్వొచ్చు. కానీ, ఇక్కడ మాత్రం ఒక వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పోయినట్లు తనే ప్రకటన ఇచ్చాడు. ఈ నెల ఏడో తేదీన ఉదయం పది గంటలకు తన డెత్ సర్టిఫికెట్ పోయినట్లు అసోంకు చెందిన రంజిత్ కుమార్ చక్రవర్తి అనే ఒక వ్యక్తి పత్రికా ప్రకటన ఇచ్చాడు.

Honour Killing: పరువు హత్య కేసు… కూతురును, ఆమె ప్రియుడిని చంపిన తల్లిదండ్రులు.. మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

దీనికి సంబంధించిన ఇమేజ్‌ను రుపిన్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ వింత ప్రకటనపై కొందరు నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో స్వర్గం నుంచి ప్రకటన ఇచ్చుంటాడు అంటూ ఒకరు.. ఇది మన దేశంలో మాత్రమే జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. కావాలంటే ఒకసారి ఆ ప్రకటన మీరూ చూడండి.