Covid 19 Vaccine : రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భేటి

దేశం కోవిడ్ వ్యాక్సిన్ వేయటంలో  103 కోట్ల మార్కును దాటిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ్ ఈరోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు.

Covid 19 Vaccine : రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భేటి

Mansukh Mandaviya

Covid 19 Vaccine :  దేశం కోవిడ్ వ్యాక్సిన్ వేయటంలో  103 కోట్ల మార్కును దాటిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్ సుఖ్ మాండవీయ్ ఈరోజు మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో  దేశంలో టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయటం, ఇప్పటివరకు మొదటి డోసు టీకా తీసుకోని వారికి టీకా వేయటంపై చర్చించనున్నారు.

టీకా డోసులు అందుబాటులోకి ఉన్నప్పటికీ రెండో డోసు విషయంలో ప్రజలు ముందుకు రాకపోవటం….నిర్లక్ష్యంగా ఉండటంపై మంత్రులు చర్చించనున్నారు. గడువు ముగిసినా 11 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ రెండో డోసు తీసుకోలేదని  అధికారిక లెక్కలు చెపుతున్నాయి.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 75 శాతం మంది ప్రజలు మొదటి డోసు తీసుకున్నారు.  31 శాతం మంది ప్రజలు రెండో డోసు తీసుకున్నారు. రెండో డోసు టీకా అందుబాటులో ఉన్నప్పటికీ మిగిలిన ప్రజలు రెండో డోసు తీసుకోకపోవటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.