ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల కొత్త తరహా దాడి..వాహనాలపై బాణం బాంబ్‌తో అటాక్

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల కొత్త తరహా దాడి..వాహనాలపై బాణం బాంబ్‌తో అటాక్

Maoist Attack arrow bombs : ఇప్పటి వరకు తుపాకులతో అటాక్ చేసిన మావోయిస్టులు… ఇప్పుడు సరికొత్త రూట్ ఎంచుకున్నారు. తుపాకుల ప్లేస్‌లో ఇప్పుడు బాణాలు పట్టుకున్నారు. కానీ వాటిని కూడా అప్‌డేట్ చేశారు. బాణాలకు గ్రైనేడ్‌లు కట్టి దాడులు చేస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు కొత్త తరహా దాడులకు తెరలేపారు. రాజమండ్రి, జగ్‌దల్‌పూర్‌ హైవేపైన వెళ్తున్న వాహనాలను టార్గెట్‌ చేశారు. బాణం బాంబులతో మావోయిస్టులు దాడి చేశారు.

మావోయిస్టుల దాడిలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇప్పటి వరకు హ్యాండ్ గ్రైనేడ్‌, లాండ్‌ మైన్, తుపాకులతో దాడి చేసిన మావోయిస్టులు… ఇలా రూట్‌ మార్చి బాణం బాంబులు వేయడంపై పోలీసులు షాక్‌ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా బాణం బాంబులతో దాడులు చేయడం పట్ల పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాంబో సినిమా తరహాలో బాణం చివర్లో గ్రైనైడ్‌ను పెట్టి దాడి చేయడం వల్ల పేలుడు తీవ్రంగా ఉంటుంది.

వీఐపీల పర్యటన సమయంలో ఆయా మార్గాల్లో పోలీసులు ముందుగా తనిఖీ నిర్వహిస్తారు. ల్యాండ్‌మైన్‌లు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు. కానీ బాణం బాంబులను ముందుగా గుర్తించే అవకాశం లేదని పోలీసుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటి తీవ్రత కూడా ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడం కష్టమని పోలీసులు అంటున్నారు.