Bharat Bandh : ఈ నెల 26న భారత్ బంద్.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భార‌త్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని కోరింది.

Bharat Bandh : ఈ నెల 26న భారత్ బంద్.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

Bharat Bandh

Bharat Bandh : మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భార‌త్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ్వాలని కోరింది.

ఈ నెల 1 నుంచి 25వ తేదీ వరకు ప్రజా ఉద్యమాల మాసంగా పాటిస్తున్న మావోయిస్టు పార్టీ…. తాము శాంతియుత చ‌ర్చ‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ంది. ఈ మేరకు తాజాగా మావోయిస్టు అధికార ప్రతినిధి పేరుతో విడుదల చేసిన రెండు పేజీల లేఖలో ప్ర‌క‌టించింది. సాయుధ పోరాటాన్ని వీడితేనే చర్చలు అంటూ ప్రభుత్వం షరతులు పెడుతోందని మావోయిస్టులు లేఖ‌లో ఆరోపించారు.

చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేసింది. పోలీసులు, జవాన్ల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. అదే సమయంలో జవాన్లు, పోలీసుల మరణాల పట్ల మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.