Four Hang: మావోయిస్టుల ప్రజా కోర్టు.. నలుగురికి ఉరి!

బీహార్‌లోని గయాలో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించి ఇద్దరు మగవాళ్లు.. ఇద్దరు ఆడవాళ్లను ఉరితీసి వారి ఇంటిని బాంబులు పెట్టి పేల్చివేశారు.

Four Hang: మావోయిస్టుల ప్రజా కోర్టు.. నలుగురికి ఉరి!

Hang

Four Hang: బీహార్‌లోని గయాలో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించి ఇద్దరు మగవాళ్లు.. ఇద్దరు ఆడవాళ్లను ఉరితీసి వారి ఇంటిని బాంబులు పెట్టి పేల్చివేశారు. దుమారియాలోని మోన్‌బర్‌ గ్రామంలోని సర్జూ భోక్తా ఇంటిని డైనమైట్‌తో పేల్చి, అతని కుమారులు సత్యేంద్ర సింగ్ భోక్తా, మహేంద్ర సింగ్ భోక్తాలను వారి భార్యలను కళ్లకు గంతలు కట్టి, ఇంటి బయట ఉరి వేశారు.

వివరాల్లోకి వెళ్తే.. గయా జిల్లా దుమారియాలోని మోన్‌బార్ గ్రామంలో.. గతేడాది ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. అయితే అది బూటకపు ఎన్‌కౌంటర్ అని ఆరోపిస్తూ.. ఇంటి యజమానులే మావోయిస్టులకు విషమిచ్చి చంపారని మావోయిస్టులు అభిప్రాయపడ్డారు. మావోలకు విషమిచ్చి చంపి పోలీసులకు సమాచారం అందించారంటూ వారిపై అభియోగపత్రం నమోదు చేశారు.

Road to Village: కొడుకు పెళ్లి కానుకగా రోడ్డు వేయించిన తండ్రి

ఈ క్రమంలోనే మావోయిస్టులు ఆ కుటుంబంపై పగ తీర్చుకున్నారు. మోన్‌బార్‌ గ్రామంలో ప్రజా కోర్టు నిర్వహించి ఉరి శిక్షలను అమలు చేశారు. హత్యలు చేసిన తర్వాత ఇంటి తలుపులకు నోటీసులను కూడా అంటించారు మావోలు. నలుగురు మావోయిస్టులు-అమ్రేష్ కుమార్, సీతా కుమార్, శివపూజన్ కుమార్, ఉదయ్ కుమార్‌లను ఈ కుటుంబం విషమిచ్చి చంపిందని, వీరి హత్యలో కుటుంబ ప్రమేయం ఉండడంతో వారికి శిక్షలు వేస్తున్నట్లు నోట్‌లో రాశారు.

MP Farmer: గేదె పాలు ఇవ్వట్లేదని కేసు పెట్టిన రైతు.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే కదా?

సమాచారం అందుకున్న పోలీసులు, సీఆర్​పీఎఫ్ సిబ్బంది హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రజాకోర్టు నిర్వహించి శిక్షలు అమలు చెయ్యడం తగ్గినప్పటికీ, ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు, అధికారులు ఉలిక్కిపడ్డారు.