Marital Rape Verdict : భార్యకు ఇష్టంలేని శృంగారం నేరమా ? ఢిల్లీ హై కోర్టు భిన్నమైన తీర్పు

భార్యకు  ఇష్టం లేకుండా, ఆమెతో చేసే బలవంతపు శృంగారంపై   ఈరోజు ఢిల్లీ హై కోర్టు  భిన్నమైన తీర్పు వెలువరించింది. 

Marital Rape Verdict : భార్యకు ఇష్టంలేని శృంగారం నేరమా ? ఢిల్లీ హై కోర్టు భిన్నమైన తీర్పు

Marital Rape

Marital Rape Verdict :  భార్యకు  ఇష్టం లేకుండా, ఆమెతో చేసే బలవంతపు శృంగారంపై   ఈరోజు ఢిల్లీ హై కోర్టు  భిన్నమైన తీర్పు వెలువరించింది.  ఇద్దరు  న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులో ఏకాభిప్రాయం లేకపోవటంతో ఈ కేసును సుప్రీం కోర్టుకు ట్రాన్సఫర్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  భార్యా భర్తల మధ్య రేప్ జరిగితే దాన్ని నేరంగా పరిగణించాలా లేదా అనే అంశంపై ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన  తీర్పును  వెలువరించారు.

భార్యను రేప్ చేస్తే అదినేరమే అవుతుందని జస్టిస్ రాజీవ్ శక్దేర్ తన తీర్పులో పేర్కోన్నారు. ఇదే అంశంలో జస్టిస్ హరి శంకర్ భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.సెక్షన్ 375 ప్రకారం అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు అని ఆయన తెలిపారు. మారిట‌ల్ రేప్ అంశంలో ఇద్ద‌రి జ‌డ్జిల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు.

ఈ అంశంలో గ‌తంలో ప‌లుమార్లు ఢిల్లీ కోర్టు వాద‌న‌లు జ‌రిగాయి.  ఫిబ్రవరి 7న వైవాహిక అత్యాచారాన్నినేరంగా పరిగణించాలని  కోరుతూ దాఖలైన పిటీషన్లపై తన వైఖరిని తెలపాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం రెండు వారాలు గడువు ఇచ్చింది. అయితే కేంద్రం విచారణలను నిలిపివేయాలని కోరింది.

ఈ అంశాన్ని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించామని వారి వద్ద నుంచి సమాధానం వచ్చేంత వరకు విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరింది. అయితే కేసును వాయిదా వేయడంసాధ్యం కాదని న్యాయమూర్తులు తిరస్కరించారు. అయితే జ‌న‌వ‌రి 21వ తేదీన తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధ‌ర్మాస‌నం ఇవాళ దాన్ని వెల్ల‌డించింది. తీర్పులో ఏకాభిప్రాయం లేక‌పోవ‌డంతో.. ఈ కేసును సుప్రీం కోర్టుకు ట్రాన్స‌ఫ‌ర్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

భారతీయ అత్యాచార చట్టం కింద భర్తలకు ఇచ్చిన మినహాయింపును కొట్టివేయాలని కోరుతూ పలు ఎన్జీవో లు ,ఆల్ ఇండియా డెమాక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్,ఇతరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు విచారించింది. కాగా వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటీషన్లను ఎన్జీవో మెన్స్ వెల్పేర్ ట్రస్ట్ వ్యతిరేకించింది.

Also Read : Asani Cyclone: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు