High Court : పెళ్లైన మహిళతో ఇంటి పనులు చేయిస్తే తప్పేంటి? పని చేసినంతమాత్రాన పనిమనిషిగా చూస్తున్నట్లు కాదు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పెళ్లైన మహిళ ఇంటి పనులు చేయటం తప్పేంటి? ఆమెతో ఇంటిపనులు చేయిస్తే తప్పెలా అవుతుంది. ఇంటిపనులు చేసినంతమాత్రాన ఆమెను పనిమనిషిగా చూస్తున్నట్లు కాదు అంటూ బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

High Court : పెళ్లైన మహిళతో ఇంటి పనులు చేయిస్తే తప్పేంటి? పని చేసినంతమాత్రాన పనిమనిషిగా చూస్తున్నట్లు కాదు : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Married woman asked to do household work for family not cruelty

Bomby High Court : పెళ్లైన మహిళ ఇంటి పనులు చేయటం తప్పేంటి? ఆమెతో ఇంటిపనులు చేయిస్తే తప్పెలా అవుతుంది. ఇంటిపనులు చేసినంతమాత్రాన ఆమెను పనిమనిషిగా చూస్తున్నట్లు కాదు అంటూ బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహ హింస కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ..భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 498A ప్రకారం వివాహం అయిన మహిళ అత్తారింటిలో పనులు చేయించటం క్రూరత్వం కాదని పేర్కొంది ఒక వివాహిత స్త్రీని కుటుంబ ప్రయోజనాల కోసం ఇంటి పని చేయమని అడిగితే..ఆమెను కుటుంబ సభ్యులు పనిమనిషిగా చూస్తున్నట్లుగా చెప్పలేమని వ్యాఖ్యానించింది.

ఇంటిపనులు చేయటం సదరు మహిళకు ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే ఆ విషయాన్ని చెప్పాలని..దానికి ఇష్టమైతేనే వరుడు తరపువారు వివాహానికి అంగీకరిస్తారా? లేదా అనేది ముందే తెలుసుకోవాలని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ తేల్చి చెప్పింది. ఇంటి కోడలను ఇంటి పనులు చేయమని చెప్పినంతనే పనిమనిషితో పోల్చడం సరికాదని తెలియజేస్తూ..విడిపోయిన భర్త, అతని తల్లిదండ్రులపై ఓ మహిళ పెట్టిన గృహ హింస కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది.

పెళ్లయిన నెల రోజుల తర్వాత భర్త తనను పనిమనిషిలా చూస్తున్నాడని కారు కొనుక్కునేందుకు రూ. 4 లక్షలు ఇవ్వాలని వేధిస్తూ శారీరకంగా..మానసికంగా హింసించేవాడని ఓ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా పెళ్లయిన మహిళను ఇంటి పనులు చేయమని అడగడం కచ్చితంగా కుటుంబం కోసమే అవుతుందని..అలా ఇంటిపనులు చేయించినంతమాత్రాన పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని పేర్కొంది.

ఇంటి పనులు చేయడం ఆమెకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉండాల్సిందని.. ధర్మాసనం అభిప్రాయపడింది. తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ దానికి తగిన ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొన్న న్యాయస్థానం.. సెక్షన్ 498ఎ ఈ కేసుకు వర్తించదని స్పష్టం చేస్తూ భర్త, అతడి తల్లిదండ్రులపై పెట్టిన గృహహింస కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.