ఇండియాలో 37ఏళ్లు పూర్తి చేసుకున్న Maruti 800

ఇండియాలో 37ఏళ్లు పూర్తి చేసుకున్న Maruti 800

Maruti 800: మారుతీ సుజుకీ నేటితో ప్రత్యేకమైన మైలురాయిని చేరుకుంది. 37ఏళ్ల తర్వాత అప్పటి సంచలన మోడల్ మారుతీ 800ను మరోసారి లాంచ్ చేసేందుకు రెడీ అయింది. దేశానికే ఇదొక మైలురాయని అభివర్ణిస్తున్నారు ప్రముఖులు. ఇండియన్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ గతిని మార్చేసిన వెహికల్ మారుతీ 800.

ఇండియాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న మారుతీ సుజుకీ ఫ్యాక్టరీ 1983న డిసెంబర్ 14వ తేదీ తొలి కారును యజమాని హర్పల్ సింగ్ కు అందజేశారు.

ఏదేమైనప్పటి మారుతీ 800లాంచ్ చేసినప్పటి దాని ధర ఎంతో తెలుసా.. రూ.47వేల 500 మాత్రమే. ఇప్పుడు అది తక్కువగా అనిపించినా.. 1983నాటి సమయంలో ఇది అత్యధిక ధరనే.

లెజెండరీ కారు.. మారుతీ 800 ఇండియాలో 2004వరకూ బెస్ట్ అమ్మకాల్లో నిలిచింది. ఆ తర్వాత దాని స్థానాన్ని ఆల్టో భర్తీ చేసింది. అయినా మారుతీ 800కు డిమాండ్ తగ్గలేదు. ఓ దశాబ్దం తర్వాత ఆ యూనిట్ లో ఆఖరి కారును జనవరి 18న గుర్గావ్ లో అమ్మారు. 1983లో లాంచ్ చేసిన కారు మొత్తం ఇండియాలో 2.7మిలియన్ యూనిట్లు అమ్ముడైంది.