నిజామాబాద్ బాక్సర్‌ను ఓడించి ఒలింపిక్స్‌కు మేరీకోమ్

నిజామాబాద్ బాక్సర్‌ను ఓడించి ఒలింపిక్స్‌కు మేరీకోమ్

ఆరు సార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్‌తో పోటీపడింది తెలుగు తేజం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ సాహసమే చేసింది. ఈ గేమ్ అనంతరం 2020 ఒలింపిక్స్‌కు మేరీ కోమ్‌కు ఎంట్రీ దక్కింది. 51కేజీల విభాగంలో ఒలంపిక్స్ క్వాలిఫైయిర్స్ కు మేరీకోమ్ అర్హతసాధించింది. ఒలింపిక్స్ బరిలోకి దిగేందుకు ఉన్న నాలుగు స్లాట్లలో ఖాళీ ఉన్న ఒక్క దాని కోసం మేరీ, జరీనాల మద్య పోరాటం జరిగింది. 

ఎవరీ జరీనా: 
మేరీ కోమ్‌తో పోరాడగల సత్తా ఉన్న జరీనా ఎవరంటే.. నిజామాబాద్ లో స్కూలింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో బీఏ చదివింది. 2009లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు వద్ద శిక్షణ తీసుకుంది. సంవత్సర కాల శిక్షణ తర్వాత 2010లో ఎరోడ్ నేషనల్స్ గోల్డెన్ బెస్ట్ బాక్సర్‌గా అవార్డు గెలిచింది. 

1996లో పుట్టిన జరీనా.. 
° 2011 మహిళా జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్
° 2014 యూత్ వరల్డ్ బాక్సింగ్  చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్
° 2014లో నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడల్
° 2015లో 16వ సీనియర్ మహిళా నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్
° 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో సిల్వర్ మెడల్ 

ఈ మాజీ ఛాంపియన్, ట్రయల్స్‌లో 9-1 తేడాతో నిఖత్ జరీన్ ను ఓడించింది. చైనాలో వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్ క్వాలిఫైయిర్స్ కు భారత తరపున 51కేజీ విభాగంలో మేరీ పోటీపడతారు.నవంబర్ లో విమెన్స్ బాక్సింగ్ వోల్డ్ ఛాంపియన్ షిప్ తర్వాత ఒలంపిక్స్ కు సరాసరి మేరే కోమ్ వెళ్లేటట్లు కనిపించారు. 

సెలక్షన్ మీద బాక్సింగ్ ఫెడరేషన్ స్పష్టమైన విధానం లేదు. అందుకే ఒలింపిక్స్ వెళ్లే అవకాశం కోసం ట్రయిల్స్ కోసం జరీన్ పట్టుబట్టింది. ఈ ట్రయల్ ను లైవ్ టెలికాస్ట్ చేయాలని కోరినా బి.ఎఫ్.ఐ. ఒప్పుకోలేదు. ట్రయిల్స్ లో ఓటమి తర్వాత మేరీకోమ్ మీద ఆరోపణలు చేశారు జరీన్. మేరీ కోమ్ తనను తిట్టారని, పోటీ అనంతరం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని, హగ్ ఇవ్వడానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించారని జరీన్ చెప్పింది.

 

తెలంగాణ బాక్సింగ్ అసోషియేషన్ అధికారులుకూడా వెల్లడించిన ఫలితాలపై సందేహాలను వ్యక్తం చేశారు. ఈ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(BFI) అధ్యక్షుడు అజయ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. తెలంగాణ అధ్యక్షుడు ఏపీ రెడ్డి తమ బాక్సర్ కు అన్యాయం జరిగిందని వాదించారు. రాజకీయాల మధ్య బాక్సింగ్ ఎలా ఎదుగుతుందని ఆయన మీడియాతో అన్నారు. ఓటమితో జరీనా కూడా ఢీలా పడ్డారు.