నిఖత్ జరీన్‌ అభినందనను తిరస్కరించిన మేరీ కోమ్

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా జరిగిన 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌పై మేరీ కోమ్ ఘన విజయం సాధించింది. తనను అభినందించేందుకు వచ్చిన నిఖత్ జరీన్ ను తిరస్కరించింది.

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 02:36 AM IST
నిఖత్ జరీన్‌ అభినందనను తిరస్కరించిన మేరీ కోమ్

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా జరిగిన 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌పై మేరీ కోమ్ ఘన విజయం సాధించింది. తనను అభినందించేందుకు వచ్చిన నిఖత్ జరీన్ ను తిరస్కరించింది.

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా జరిగిన 51 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌పై మేరీ కోమ్ ఘన విజయం సాధించింది. అయితే మేరీ కోమ్ మ్యాచ్ అనంతరం ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌కు సాటి బాక్సర్‌ పట్ల ఎలా వ్యవహరించాలో నేర్పించాలని కామెంట్లు వస్తున్నాయి.

51 కేజీలో విభాగంలో టోక్యో ఒలింపిక్స్ ట్రయల్స్‌కు భారత్‌ నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం చెలరేగడంతో మేరీకోమ్, నిఖత్‌ మధ్య పోటీ అనివార్యమైంది. నిఖత్ జరీన్ అభ్యంతరం మేరకు ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో గెలిచిన మేరీ కోమ్ మ్యాచ్ అనంతరం తన అసహనాన్ని వెళ్లగక్కింది. తనను అభినందించేందుకు వచ్చిన నిఖత్ జరీన్ ను తిరస్కరించింది. దీనిపై వివరణ కోరగా.. ఆమెకు నేనేందుకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలని మేరీ కోమ్ ప్రశ్నించింది. జరీన్‌ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల్ని ఇష్టపడనని మేరీకోమ్‌ వ్యాఖ్యానించింది.

మ్యాచ్‌ తర్వాత మేరీకోమ్‌ ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదని నిఖత్‌ తెలిపింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అంపైర్‌ విజేతను ప్రకటించగానే.. మేరీని హత్తుకునే ప్రయత్నం చేశాను, కానీ ఆమె తిరస్కరించిందని తెలిపింది. ఒక జూనియర్‌గా నాకు సీనియర్ల నుంచి గౌరవం దక్కుతుందని ఆశించాను.. కానీ మేరీ కోమ్ తీరు నన్ను బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేసింది.