ఉచితంగా మాస్క్‌లు పంచిన వ్యక్తికి కరోనా…

  • Published By: nagamani ,Published On : June 5, 2020 / 05:54 AM IST
ఉచితంగా మాస్క్‌లు పంచిన వ్యక్తికి కరోనా…

పుణ్యానికి వెళితే పాపం ఎదురొచ్చిందంటే ఇదేనేమో. కరోనా కాలంలో ప్రతీ ఒక్కరూ ముఖాలకు మాస్క్ లు తప్పనిసరిగా మారిన క్రమంలో ఓ వ్యక్తి అందరికి ఉచితంగా మాస్క్ లు పంచుతున్నాడు. కానీ అతనిపై కరోనా పగబట్టిందేమో అన్నట్లుగా అనికి కోవిడ్-19 సోకింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే..తంజావూర్ జిల్లా వవూసి నగర్‌కు చెందిన ఓ యువకుడు ‘మక్కల్ పాదై’ స్వచ్ఛంద సంస్థ తరపున కరోనా సేవలు చేస్తున్నాడు. తనకు కరోనా వస్తుందని ఏమాత్రం భయపడలేదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నాడు. దీంతో తను పనిచేసే స్వచ్చంద సంస్థ తరపున ఉచితంగా అందరికీ మాస్కులు పంచాడు. 

ఆ తరువాత అతను ళ్లి చెన్నై వెళ్లి అక్కడ కూడా పలు ప్రాంతాలు తిరుగుతూ ఉచితంగా  మాస్కులు పంచాడు. ఆ తర్వాత తిరిగి తంజావూరు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడు తాజాగా నారోగ్యబారిన పడ్డాడు. కరోనా లక్షణాలు ఉండటంతో అతనికి పరీక్షలు చేయగా  కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో సంచలనం రేగింది. అతను ఏఏ ప్రాంతాలు తిరగి మాస్కులు పంచాడు. ఎవరెవరు తీసుకున్నాడు అనే విషయం పెద్ద తలనొప్పిగా మారింది. 

కాగా తమిళనాడులో  25,872 కరోనా కేసులు నమోదు కాగా..వీరిలో 14వేల 316మంది రికవర్ అయ్యారు. 208మంది మృతి చెందారు. 

Read: భారత్‌లో 24గంటల్లో 10వేల కరోనా కేసులు నమోదు