Mask Driving Alone : పబ్లిక్ ప్లేసుల్లో కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసినా మాస్క్ తప్పనిసరి

పబ్లిక్ ప్లేసుల్లో కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు కారులో వెళ్లినా తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని పేర్కొంది.

Mask Driving Alone : పబ్లిక్ ప్లేసుల్లో కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసినా మాస్క్ తప్పనిసరి

Mask Must Even If Driving Alone, Car A Public Place (1)

Mask Must Even If Driving Alone Car : పబ్లిక్ ప్లేసుల్లో కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు కారులో వెళ్లినా తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని పేర్కొంది. మాస్క్ అనేది సురక్ష కవచం లాంటిదని, ధరించిన వ్యక్తితో పాటు చుట్టుపక్కలవాళ్లకు కూడా రక్షణ ఉంటుందని కోర్టు తెలిపింది. ఒంటరిగా డ్రైవింగ్ చేసే సమయంలో మాస్క్ ధరించలేదని జరిమానా విధించడంపై నమోదైన కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారించింది.

ఈ కేసును విచారించిన జడ్జి ప్రతిభా ఎం సింగ్ పై విధంగా తీర్పునిచ్చారు. ‘కారులో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించడానికి అభ్యంతరమేంటి? ఇది మీ సురక్షితం కోసమే కదా?’ అని జడ్జి అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి రోజురోజుకీ తీవ్రమవుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నా లేదా తీసుకోకపోయినా సరే ప్రతిఒక్కరూ పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సైంటిస్టులు కూడా కరోనా వ్యాప్తిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు నిలిపిన సమయంలో తరచూ డ్రైవర్ అద్దాలను కిందికి దించేస్తుంటారని కోర్టు తెలిపింది. కరోనావైరస్ తీవ్రమైన అంటువ్యాధి, ఎవరికైనా వైరస్ తొందరగా సోకే ప్రమాదం ఉందని పేర్కొంది. న్యాయవాది సౌరబ్ శర్మ ఫిర్యాదు ఆధారంగా జడ్జి ప్రతిభా సింగ్ పై తీర్పును వెలువరించారు. కారులో మాస్క్ ధరించలేదనే కారణంతో ఢిల్లీ పోలీసులు శర్మకు రూ.500 జరిమానా విధించారు. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది కోర్టులో ఫిర్యాదుచేశారు.

కానీ, పబ్లిక్ ప్లేసుల్లో ఒంటరిగా ఉన్నా కూడా మాస్క్ ధరించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. ఒంటరిగా ఉన్నప్పుడు మాస్క్ ధరించాలంటూ ఎలాంటి నిబంధనల లేదంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైకోర్టుకు విన్నవించింది. కానీ, ప్రతి రాష్ట్రంలో సొంత నిబంధనలు అమలు చేసుకునే హక్కు ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది.