Madhya Pradesh : మాస్క్ పెట్టుకోలేదని ఆటోడ్రైవర్ ను కుమ్మేసిన పోలీసులు

ఓ ఆటో డ్రైవర్ మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదని పోలీసులు అతడిని కుమ్మేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Madhya Pradesh : మాస్క్ పెట్టుకోలేదని ఆటోడ్రైవర్ ను కుమ్మేసిన పోలీసులు

Police

Mask Slipped : ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా విజృంభిస్తోంది. లక్షలాదిగా కేసులు నమోదవుతున్నాయి. తగ్గుముఖం పడుతుండగా..పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే కేసులు పెరుగుతున్నాయని, తప్పకుండా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అంటూ…హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లేనిపక్షంలో జరిమాన విధించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అయినా..కొంతమంది డోంట్ కేర్ అంటున్నారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలాగే నిబంధనలు విధించింది. అయితే…ఓ ఆటో డ్రైవర్ మాస్క్ సరిగ్గా పెట్టుకోలేదని పోలీసులు అతడిని కుమ్మేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇండోర్ లో కృష్ణ కెయర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు ఆటోలో వెళుతున్నాడు. ఈ సమయంలో మాస్క్ సరిగ్గా ధరించలేదని గుర్తించిన పోలీసులు కృష్ణను ఆపారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రావడానికి అతను నిరాకరించాడు. అంతే..ఆటో డ్రైవర్ పై దాడికి దిగారు. అక్కడనే ఉన్న కొంతమంది గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి దర్యాప్తుకు ఆదేశించారు. దాడికి పాల్పడిన పోలీసులు Kamal Prajapat, Dharmendra Jatలుగా గుర్తించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. గత 24 గంటల్లో 3 వేల 722 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. గత మార్చి నెల నుంచి మాస్క్ ధరించని లక్షా 61 వేల మందికి జరిమాన వేశారు. వీరి దగ్గరి నుంచి 1.85 కోట్ల రూపాయలు వసూలు చేశారు.

Read More : Infant 3 Legs : మూడు కాళ్లతో శిశువు జననం… అరుదైన శస్త్రచికిత్సతో తొలగింపు..