UIDAI : ఆధార్‌‌కు కూడా మాస్క్, మరింత సేఫ్టీ

UIDAI (యూఐడీఏఐ) అనేక రకాల ఆధార్ సేవలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా...కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే మాస్క్. కొత్తగా తీసుకొచ్చిన ఈ మాస్క్ ఆధార్ వల్ల ఆధార్ కార్డుకు మరింత సేఫ్టీ ఉంటుందని యూఐడీఏఐ వెల్లడిస్తోంది.

UIDAI : ఆధార్‌‌కు కూడా మాస్క్, మరింత సేఫ్టీ

Aadhar Mask

Masked Aadhaar Card : ఆధార్..ఇప్పుడు అందరికీ అవసరమైంది. చిన్న పిల్లవాడి దగ్గరి నుంచి..వృద్ధుల వరకు ఆధార్ కంపల్సరీ అయిపోయింది. ప్రతి దానికి ఆధార్ తో ప్రభుత్వాలు లింక్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతొక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంది. UIDAI (యూఐడీఏఐ) అనేక రకాల ఆధార్ సేవలను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా…కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే మాస్క్.
కొత్తగా తీసుకొచ్చిన ఈ మాస్క్ ఆధార్ వల్ల ఆధార్ కార్డుకు మరింత సేఫ్టీ ఉంటుందని యూఐడీఏఐ వెల్లడిస్తోంది.

‎మాస్క్ ఆధార్ ఆప్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో ఈ ఆధార్ లో మొదటి 8 అంకెలను ‘XXX’ వంటి కొన్ని అక్షరాలతో భర్తీ చేయనున్నారు.
‎ఇందులో మీ ఆధార్ నెంబర్ చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
‎ఇక్కడ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, క్యూఆర్ కోడ్ తదితర వివరాలు ఎప్పటిలాగే కనిపిస్తాయి.

‎డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా ?
‎ముందుగా యూఐడీఏఐ వెబ్ సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.
‎”మై ఆధార్ ఆప్షన్” ఎంచుకోండి.
‎’డౌన్‌లోడ్ ఆధార్’ మీద క్లిక్ చేయాలి.

 
ఆధార్ నంబర్, ఎన్ రోల్ మెంట్ ఐడీ(ఈఐడీ), వర్చువల్ ఐడీ(విఐడీ) 3 ఆప్షన్లు ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ‘I want a masked Aadhaar?’ అనే దానిపై క్లిక్ చేయండి.
‎ఇప్పుడు క్యాప్చ ఎంటర్ చేసి, సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయండి.
‎మీ రిజిష్టర్డ్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దీనిని ఎంటర్ చేయాలి.
‎ తర్వాత..మాస్క్ ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలి.