జాగ్రత్త : ప్రాణాలు తీస్తున్న పొగమంచు

  • Published By: madhu ,Published On : February 4, 2019 / 01:12 AM IST
జాగ్రత్త : ప్రాణాలు తీస్తున్న పొగమంచు

ఢిల్లీ : పొగమంచు కారణంగా పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. భారీగా మంచు అలుముకోవడంతో దారి కనిపించడం లేదు. దీనితో పలు వాహనాలు ఢీకొంటున్నాయి. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కారణంగా యూపీలోని అగ్రా – లక్నో ఎక్స్ ప్రెస్ హైవైపై ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. 

ట్రక్కు కిందకు కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇక రాజస్థాన్‌లో శిఖర్ జిల్లాలో సుమారు 40 వాహనాలు ఢీకొన్నాయి. దీనితో ఆ ప్రాంతంలో భారీ రద్దీ నెలకొంది. మరోవైపు హిమాచల్ రాష్ట్రంలోని సిమ్లా, మనాలీలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరగగా…డల్హౌసీ, కుఫ్రీలో మాత్రం అత్యల్ప టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. జార్ఖండ్‌లో ఓ బస్సు చెట్టును ఢీకొన్న ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోగా 30మంది ప్రయాణీకులు గాయపడ్డారు.