తమిళనాడు కోయంబేడులో భారీ అగ్ని ప్రమాదం..ప్రైవేట్ బస్సులు నిలిపే స్థలంలో మంటలు.. తగలబడిన వోల్వో బస్సులు

  • Published By: bheemraj ,Published On : August 23, 2020 / 04:09 PM IST
తమిళనాడు కోయంబేడులో భారీ అగ్ని ప్రమాదం..ప్రైవేట్ బస్సులు నిలిపే స్థలంలో మంటలు.. తగలబడిన వోల్వో బస్సులు

తమిళనాడులోని కోయంబేడులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సులు నిలిపే స్థలంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కరోనా కారణంగా అక్కడి నిలిపివుంచిన వోల్వో బస్సులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. బస్సులన్నీ పక్కనేపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరింత తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రైవేట్ కోయంబేడు మార్కెట్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ బస్ స్టాండ్ లో కోయంబేడులో బస్టాంట్ కూడా ఒకటి. నగర శివారులో ఉన్న కోయంబేడు బస్టాండ్ కు ఒకే రోజు వందల వేల సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి.

ఇక్కడే ప్రైవేట్ స్టాండ్ కూడా ఉంది. ప్రైవేట్ వోల్వో బస్సులు, ప్రైవేట్ ఓమ్ని వెహికిల్స్ నిలుదల చేసి ఉంటారు. అయితే అక్కడ నిలిపి ఉన్న వోల్వో బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఆ బస్సులో మంటలు రావడానికి కారణాలు తెలియలేదు. లోపల షార్ట్ సర్క్యూట్ అయిందా? ఎవరైనా ఆకతాయి పనులు చేశారా? కారణాలు తెలియలేదు. బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై పోయింది. ఆ బస్సును ఆనుకుని వరుసగా అనేక బస్సులు నిలిపి ఉన్నాయి. వాటి డ్రైవర్స్ అక్కడ లేరు.

మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది ఆ బస్సులను తరలించేందుకు నానా తంటాలు పడ్డారు. చివరికి బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై పోయింది. రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. పక్కలే ఉన్న రెండు బస్సులకు మంటలంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఒక్క బస్సు పూర్తిగా దగ్ధమై పోయింది. రెండు బస్సులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

నిలుపుదల చేసి ఉన్న బస్సులో ఒక్కసారిగా మంటలు ఎలా చెలరేగాయన్నది అంతు చిక్కని అంశంగా మారింది. పైగా మంటల స్థాయి కూడా చాలా ఎక్కువగా ఉంది. అగ్నిప్రమాదంలో కోయంబేడు బస్టాండ్ లో తీవ్ర కలకలం రేపింది. దీంతో నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడట్లైంది.