Manipur landslide: మణిపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు జవాన్లు మృతి.. 45మంది గల్లంతు

మణిపూర్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 45మంది గల్లంతయ్యారు. ఘటన స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. రక్షించిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంకా 45మంది తప్పిపోయారని నోనీ జిల్లా ఎస్‌డిఓ సోలమన్ ఎల్ ఫిమేట్ తెలిపారు.

Manipur landslide: మణిపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు జవాన్లు మృతి.. 45మంది గల్లంతు

Manipur

Manipur landslide: మణిపూర్‌లో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ బేస్ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 45మంది గల్లంతయ్యారు. ఘటన స్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. రక్షించిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇంకా 45మంది తప్పిపోయారని నోనీ జిల్లా ఎస్‌డిఓ సోలమన్ ఎల్ ఫిమేట్ తెలిపారు. నోనీ ఆర్మీ మెడికల్ యూనిట్‌లో చికిత్స పొందుతున్న 19 మందిని ఇప్పటికే రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గాలింపు, సహాయక చర్యల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, వైద్యులతో సహా అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయని సీఎం ట్వీట్ చేశారు.

ఇదిలాఉంటే భారీ శిథిలాలు ఇజెయి నది ప్రవాహానికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం పొంచిఉందని నోనీ డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. ఈ మేరకు నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆయన ప్రకటన జారీ చేశారు. తుపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ శిబిరం వద్ద దురదృష్టవశాత్తు కొండచరియలు విరిగిపడటం వల్ల అక్కడ ఏడుగురు మరణించారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇజెయి నది ప్రవాహానికి కూడా శిథిలాలు అడ్డుగా ఉన్నాయని, ఆనకట్ట లాంటి నిల్వ పరిస్థితి ఏర్పడితే.. నోనీ జిల్లా ప్రధాన కార్యాలయంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుతుందని తెలిపారు. పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారుతుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా పిల్లలు నది దగ్గరికి రాకుండా చూసుకోవాలని, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఖాళీ చేసే అవకాశం ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోయావాలని సూచించారు. భారీ వర్షం పడితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇదిలాఉంటే ఈ ఘటనపై మణిపూర్ సీఎంతో కేంద్ర హోమంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.

మణిపూర్‌లోని నోనీ జిల్లాలోని టుపుల్‌ యార్డ్‌ రైల్వే నిర్మాణ శిబిరం సమీపంలో కొండచరియలు విరిగిపడి జవాన్లు మరణించిన వార్త చాలా బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కటుుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాహుల్ గాంధీ ట్విటర్ ద్వారా తన సందేశాన్ని ఉంచారు.