Vaishno Devi Temple : వైష్ణో దేవీ ఆలయంలో తొక్కిసలాటపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ

మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో దాదాపు 12 మంది మృతి చెందారు. దీనిపై  ఉన్నత స్థాయి విచారణకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు.

Vaishno Devi Temple : వైష్ణో దేవీ ఆలయంలో తొక్కిసలాటపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ

Vaishno Devi Temple

Vaishno Devi Temple : మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో దాదాపు 12 మంది మృతి చెందారు. కాసేపటి వరకూ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న అనంతరం తిరిగి వైష్ణో దేవీయాత్రను కొనసాగిస్తున్నారు. ఆలయంలో భక్తుల దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్) నేతృత్వంలో ADGP, జమ్మూ డివిజనల్ కమిషనర్‌తో విచారణ కమిటీ ఏర్పాటుకానుంది.

ఘటనపై ఇప్పటికే ప్రధాని, హోమ్ మంత్రితో మనోజ్ సిన్హా మాట్లాడారు. తొక్కిసలాట ఘటనలో 12 మంది మృతి ,23 మందికి గాయాలు అయినట్లుగా తెలుస్తుంది. తెల్లవారుజామున త్రికూట కొండలపై ఉన్న గర్భగుడి వెలుపల మూడవ నంబర్ గేట్ సమీపంలో 2:45 గంటలకి తొక్కిసలాట చోటుచేసుకుంది.

కొత్త సంవత్సరం సందర్భంగా మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తుల రద్దీతో భారీ తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక అంచనా.

ఇది కూడా చదవండి : ఫిబ్రవరిలో ఏపీ గ్రూప్‌1 ఫలితాలు

మాతా వైష్ణోదేవి ఆలయ తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ కేంద్రమంత్రులు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి, ప్రధాని. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2లక్షలు, గాయపడిన వారికి 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు మోదీ. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ప్రకటించారు జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ మనోజ్ సిన్హా.

ఘటనపై జమ్మూకాశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్, నిత్యానంద రాయ్‌తో మోదీ మాట్లాడారు. ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు మాతా వైష్ణోదేవి ఆలయానికి కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెళ్లారు. తొక్కిసలాట ఘటన అంశాన్ని నేరుగా ప్రధాని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.

ఇది కూడా చదవండి : టూరిజం శాఖ ఇంచార్జ్ ఎండీ పై అత్యాచార కేసు నమోదు