May 03 తర్వాత..ఏం జరుగబోతోంది : గ్రీన్ జోన్ ప్రాంతాల్లో సడలింపులు

May 03 తర్వాత..ఏం జరుగబోతోంది : గ్రీన్ జోన్ ప్రాంతాల్లో సడలింపులు

కరోనా రాకాసి కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ గడువు మే 03తో ముగియనుంది. ఇప్పటికే సెకండ్ టైమ్ దీనిని కొనసాగించింది కేంద్రం. కానీ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటీ ? మరలా లాక్ డౌన్ విధిస్తారా ? పొడిగిస్తారా ? లేక సడలింపులు ఇస్తారా ? ఇలా అనేక చర్చలు జరుగుతున్నాయి. ఎవరైనా కలిస్తే దీనిపైనే ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు.

కానీ..దీనిపై ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. మే 03 తర్వాత..కూడా మాస్క్ లు, సోషల్ డిస్టెన్స్ పాటించాలనే నిబంధనలు కంటిన్యూ చేయాలని ఆదేశిస్తారని తెలుస్తోంది. ప్రధానంగా ప్రజా రవాణా నిలిచిపోవడంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.

అంతేగాకుండా..విమానాలు, రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరనే టాక్. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్ల పరిధిలో చేర్చిన ప్రాంతాలపై ప్రభుత్వం సమీక్షించనుంది. గ్రీన్ జోన్ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని భావించింది కేంద్రం. కానీ కొన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. భారత్ లో నిర్వహిస్తున్న కరోనా టెస్టుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆంక్షల సడలింపు విషయంలో రాష్ట్రాలకు అవకాశం కల్పించింది కేంద్రం. కానీ…కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాలు మే 03 వరకు లాక్ డౌన్ కొనసాగించేందుకు నిర్ణయించాయి. ఇక్కడ తెలంగాణ మాత్రం మే 07 వరకు నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం మే 03 తర్వాత..కేంద్రం ఎలాంటి స్టెప్ తీసుకొంటుందనేది ఉత్కంఠ నెలొంది.