మాయావతిని ప్రేమిస్తా…రాహుల్ గాంధీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 11, 2019 / 01:28 PM IST
మాయావతిని ప్రేమిస్తా…రాహుల్ గాంధీ

బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని రాహుల్ తెలిపారు.ఖచ్చితంగా తమ మధ్య పొలిటికల్ ఫైట్ ఉందన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ కోసం తాము ఫైట్ చేస్తామని,కానీ దేశ అభివృద్ధిలో మాయావతి సహకారాన్ని తాను గౌరవిస్తానన్నారు.శనివారం(మే-11,2019) ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పై మాయావతి రోజూ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్ ను ఓ పాముగా మాయా అభివర్ణించారు.కాంగ్రెస్,బీజేపీ దొందూ దొందూ అంటూ మాయా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.దళిత మహిళపై గ్యాంగ్ రేప్ ఇష్యూకి సంబంధించి రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇవాళ కూడా మాయా తీవ్ర విమర్శలు చేశారు.తమ రాజకీయ లబ్ది కోసం రాజస్థాన్ లో ఎన్నికలు ముగిసేంతవరకు ఈ ఘటనను కాంగ్రెస్ తొక్కిపెడుతుందని మాయా విమర్శించారు.నోరెత్తకుండా బాధితురాలి కుటుంబసభ్యలను బెదిరిస్తోందంటూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.