Mayawati: వచ్చే ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన మాయావతి
ఒంటరిగానే పోటీ చేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన విషయాన్ని మాయావతి మీడియా ద్వారా వెల్లడించారు. తాము నాలుగు సార్లు అధికారం చేపట్టామని, మళ్లీ అధికారాన్ని చేపడతామని అన్నారు. పేద ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని, పార్టీ సిద్ధాంతమే వారిని అభివృద్ధిలోకి తీసుకురావడమని ఆమె అన్నారు

Mayawati says BSP to go it alone in assembly, LS polls; calls for return to ballot paper
Mayawati: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటిరగానే పోటీ చేస్తుందని, ఏ పార్టీతో తమకు పొత్తు ఉండదని ఆ పార్టీ సుప్రెమో మాయావతి ప్రకటించారు. జనవరి 15న తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న మాయావతి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల గురించి వివరించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, విపక్ష కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలతో తమకు సైద్ధాంతిక వ్యత్యాసాలు ఉన్నాయని, అందుకే తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలని అనుకోవడం లేదని అన్నారు. అయితే కాంగ్రెస్ సహా పలు పార్టీలు తమతో పొత్తుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకు తాము సముఖంగా లేమని ఆమె పేర్కొన్నారు.
Russia President Putin: పుతిన్ రాజీనామా.. వారసుడి ఎంపికపై కసరత్తు
ఒంటరిగానే పోటీ చేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన విషయాన్ని మాయావతి మీడియా ద్వారా వెల్లడించారు. తాము నాలుగు సార్లు అధికారం చేపట్టామని, మళ్లీ అధికారాన్ని చేపడతామని అన్నారు. పేద ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని, పార్టీ సిద్ధాంతమే వారిని అభివృద్ధిలోకి తీసుకురావడమని ఆమె అన్నారు. అయితే ఎన్నికల్లో ఈవీఎంల విషయమై చాలా కాలంగా వినిపిస్తున్న తన వాదనను మాయావతి మరోసారి వినిపించారు. వచ్చే అన్ని ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ద్వారా నిర్వహిస్తే ట్యాంపరింగ్ జరిగే అవకాశాలున్నట్లు వస్తున్న విమర్శలను ఆమె సమర్ధించారు.