ప్రజాజీవితానికి మాయా అనర్హురాలు : రాజకీయ లబ్థి కోసం మోడీ భార్యనే వదిలేశాడు

  • Published By: venkaiahnaidu ,Published On : May 13, 2019 / 10:42 AM IST
ప్రజాజీవితానికి మాయా అనర్హురాలు : రాజకీయ లబ్థి కోసం మోడీ భార్యనే వదిలేశాడు

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించారు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ. ప్రజాజీవితానికి మాయావతి అనర్హురాలని జైట్లీ అన్నారు.ప్రధానమంత్రి కావాలని మాయా అనుకుంటుందని,ఆమె గవర్నెన్స్,ఎథిక్స్,ఉపన్యాసాలు మరింత దిగజారిపోయాయని,ప్రధాని పై ఇవాళ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె ప్రజాజీవితానికి పనికిరాదని సృష్టం చేసేదిగా ఉన్నాయని జైట్లీ విమర్శించారు.

అల్వార్ లో దళిత మహిళపై గ్యాంగ్ రేప్ విషయంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి మొసలి కన్నీళ్లు కారుస్తుందంటూ ఆదివారం ప్రధాని మోడీ విమర్శలు చేయడంపై మాయావతి కూడా అంతేస్థాయిలో తీవ్రమైన పదజాలంతో మోడీపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో ఇవాళ(మే-13,2019) మాయా మాట్లాడుతూ…దళితులపై ప్రేమ చూపిస్తున్నట్లుగా మోడీ నాటకాలుడుతున్నాడని మాయా విమర్శించారు.దళితులు అణగదొక్కబడుతున్నప్పుడు మోడీ సైలెంట్ గా ఉన్నాడని దళితుల విషయంలో మోడీ డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాడని మాయా విమర్శించారు.రాజకీయ లబ్ది కోసం సొంత భార్యను వదిలేసిన మోడీ..ఇతరుల అక్కచెల్లల్లను,భార్యలను ఎలా గౌరవించగలడని మాయా విమర్శించారు.ఇలాంటి వ్యక్తికి ఓటు వేయవద్దని దేశ మహిళలకు తాను ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నానని మాయా అన్నారు.సందర్భానికి అనుగుణంగా మోడీ తన కులాన్ని మారుస్తూ ఉన్నాడని మాయా విమర్శించారు.