పార్టీపై నమ్మకం ఉంది.. ఎన్నికల్లో పోటీచేయను: మాయావతి

పార్టీపై నమ్మకం ఉంది.. ఎన్నికల్లో పోటీచేయను: మాయావతి

యూపీ బీఎస్పీ సుప్రీమో మాయవతి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించారు. బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు.

లక్నో: యూపీ బీఎస్పీ సుప్రీమో మాయవతి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించారు. బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొంటానని చెప్పారు. బీఎస్సీ, ఏప్రిల్, మే నెలలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీపార్టీ కలిసి పొత్తుగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసిన మాయావతి లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నా నిర్ణయాన్ని పార్టీ పూర్తిగా అర్థం చేసుకుంటుందని విశ్వాసంతో ఉన్నాను. సమాజ్ వాదీ పార్టీతో బీఎస్పీ పొత్తు విజయవంతంగా కొనసాగుతోంది. సీటు ముందు ఖాళీ చేసి.. తర్వాత అవసరమైతే లోక్ సభకు మళ్లీ పోటీ చేస్తా’ అని మాజీ సీఎం మాయావతి అన్నారు. 

ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరుగబోయే జాతీయ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ పార్టీలు పొత్తుగా ఏర్పడి ఉమ్మడి రాజకీయ శత్రువు బీజేపీ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. నాలుగుసార్లు యూపీ సీఎంగా ఎన్నికైన మాయావతి పార్లమెంట్ కు కూడా చాలాసార్లు ఎన్నికయ్యారు.

1994లో రాజ్యసభ స్థానానికి తొలిసారి ఆమె ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ.. 80 స్థానాలున్న యూపీ రాష్ట్రంలో సింగిల్ సీటు కూడా సాధించలేకపోయింది. యూపీలో బీఎస్పీ 20 శాతం ఓట్లను మాత్రమే చేజిక్కిచుకుంది.
Read Also : దొంగ దొరికాడు : లండన్ లో నీరవ్ మోడీ అరెస్ట్

×